టీవీ-9 రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు
టీవీ-9 రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదయింది. హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు… రవిప్రకాష్ పై చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసులను పెట్టారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని, యాజమాన్యానికి తెలియకుండా నిధులను దారి మళ్ళించాడని…. రవిప్రకాష్ పై సైబర్ క్రైం లో కేసు పెట్టారు. రవిప్రకాష్ ఇంటిని, కార్యాలయాన్ని పోలీసులు సోదా చేశారు. రెండు రోజుల నుంచి టీవీ-9 సీఈఓ రవిప్రకాష్ కోసం పోలీసులు […]
టీవీ-9 రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదయింది. హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు… రవిప్రకాష్ పై చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసులను పెట్టారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని, యాజమాన్యానికి తెలియకుండా నిధులను దారి మళ్ళించాడని…. రవిప్రకాష్ పై సైబర్ క్రైం లో కేసు పెట్టారు.
రవిప్రకాష్ ఇంటిని, కార్యాలయాన్ని పోలీసులు సోదా చేశారు. రెండు రోజుల నుంచి టీవీ-9 సీఈఓ రవిప్రకాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
టీవీ-9 లో రవిప్రకాష్ భారీ ఎత్తున కంపెనీ నిధులను దారి మళ్ళించాడని గుర్తించిన కొత్త యాజమాన్యం ఆయనను వైదొలగాలని కొన్నిరోజులుగా ఆదేశాలు జారీచేసినా రవిప్రకాష్ పట్టించుకోలేదు.
పైగా గరుడపురాణం ఫేమ్ శివాజీని తెరమీదకు తెచ్చి కొత్త యాజమాన్యంతో రవిప్రకాష్ గేమ్స్ ఆడడం చూసి యాజమాన్యం కంపెనీ ఆర్థిక లావాదేవీలపై అంతర్గత విచారణ జరిపినట్టు తెలిసింది.
భారత్ వర్ష్ ఛానల్స్ వ్యవహారంలో రవిప్రకాష్ కోట్లు దారి మళ్ళించినట్లుగా యాజమాన్యం ఒక నిర్ధారణకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.