సొంత సినిమాకు బడ్జెట్ పెంచిన నాగ్

సీరియర్ హీరోలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమా హిట్ అయినా లాభాలు రాకపోవడానికి కారణం అది భారీ బడ్జెట్ సినిమా కావడమే. అందుకే బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున లాంటి సీనియర్లు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈసారి మాత్రం నాగార్జున కొంచెం అడ్వాన్స్ అయ్యాడు. అవును.. తన సొంత బ్యానర్ పై తెరకెక్కుతున్న మన్మధుడు-2 సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టబోతున్నాడు నాగార్జున. […]

Advertisement
Update:2019-05-09 10:48 IST

సీరియర్ హీరోలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమా హిట్ అయినా లాభాలు రాకపోవడానికి కారణం అది భారీ బడ్జెట్ సినిమా కావడమే.

అందుకే బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున లాంటి సీనియర్లు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈసారి మాత్రం నాగార్జున కొంచెం అడ్వాన్స్ అయ్యాడు.

అవును.. తన సొంత బ్యానర్ పై తెరకెక్కుతున్న మన్మధుడు-2 సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టబోతున్నాడు నాగార్జున. ఈ మేరకు అనుకున్న బడ్జెట్ ను 30శాతం పెంచినట్టు తెలుస్తోంది. ఇది కూడా నాగ్ కావాలని తీసుకున్న నిర్ణయమే. ఈమధ్య కాలంలో నాగ్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ఇదే కాబోతోంది.

రాహుల్ రవీంద్రన్ చెప్పిన స్టోరీలైన్ నాగార్జునకు బాగా నచ్చింది. స్టోరీతో పాటు బడ్జెట్ కూడా లాక్ చేసి మరీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే సినిమాలో ఓ కీలకమైన ఎపిసోడ్ పై ఇంకాస్త ఎక్కువ ఖర్చుపెడితే బాగుంటుందని నాగార్జునకు అనిపించిందట. క్వాలిటీ విషయంలో రాజీపడని ఈ సీనియర్ హీరో, వెంటనే బడ్జెట్ పెంచేందుకు అంగీకరించాడు. ఈ విషయంలో దర్శకుడి నుంచి ఎలాంటి ఒత్తిడి లేదట. నాగార్జున స్వయంగా తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News