ఓడిపోతే బాబు ప్లాన్...

గెలిస్తే తన పథకాలు… సంక్షేమం… ప్రజల గెలుపు… ఓడిపోతే మాత్రం… చంద్రబాబు పెద్ద ప్లాన్ వేసినట్టు సమాచారం. ఇందుకోసం దేశవ్యాప్తంగా నానా యాగీ చేసేందుకు టీడీపీ అనుకూల మీడియా, చంద్రబాబు స్కెచ్ గీసినట్టు తెలిసింది. రాబోయే ఎన్నికల ఫలితాలలో చంద్రబాబు ఓడిపోతే అది ఆయన తప్పుకాదట. ప్రజావ్యతిరేకత అస్సలు లేదట.. కేవలం ఈవీఎంలలో లోపాల వల్ల మాత్రమే టీడీపీ పార్టీ ఓడిపోయిందని ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు చంద్రబాబు దేశవ్యాప్తంగా దిగ్విజయంగా […]

Advertisement
Update:2019-05-09 08:30 IST

గెలిస్తే తన పథకాలు… సంక్షేమం… ప్రజల గెలుపు… ఓడిపోతే మాత్రం… చంద్రబాబు పెద్ద ప్లాన్ వేసినట్టు సమాచారం. ఇందుకోసం దేశవ్యాప్తంగా నానా యాగీ చేసేందుకు టీడీపీ అనుకూల మీడియా, చంద్రబాబు స్కెచ్ గీసినట్టు తెలిసింది.

రాబోయే ఎన్నికల ఫలితాలలో చంద్రబాబు ఓడిపోతే అది ఆయన తప్పుకాదట. ప్రజావ్యతిరేకత అస్సలు లేదట.. కేవలం ఈవీఎంలలో లోపాల వల్ల మాత్రమే టీడీపీ పార్టీ ఓడిపోయిందని ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

ఈ మేరకు చంద్రబాబు దేశవ్యాప్తంగా దిగ్విజయంగా పనిని ప్రారంభించాడట. ఈ ఆలోచనలతోనే చంద్రబాబు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను కూడగట్టి 21మంది నేతలతో కలిసి సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 50శాతం వీవీ ప్యాట్ లను లెక్కించాలని పిటీషన్ వేశారు.

ఇలా గెలిస్తే తన ప్రతిభ, ఓడితే మాత్రం ఈవీఎం కుట్ర అని తెరతీయడానికి చంద్రబాబు సర్వం సిద్ధం చేస్తున్నారట.. అంతేకాదు.. సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్ గుర్తుకు పడుతుందన్న ప్రచారాన్ని కూడా బాబు తీసుకొచ్చారు.

చంద్రబాబు వేస్తున్న ఈ ఎత్తుగడ ఎన్నికల సంఘాన్ని, అత్యున్నత న్యాయస్థానాన్ని కించపరిచేలా ఉంది. దీనిపై ఇప్పటికే విమర్శలు చెలరేగుతున్నాయి. బాబుకు ఆయా వ్యవస్థలు షాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.

Tags:    
Advertisement

Similar News