మోడీకి కౌంట్ డౌన్.... మొదలైనట్టేనట....
మోడీ తీరు చూస్తుంటే రోజులు దగ్గరపడ్డట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సద్వివిమర్శలు మాని ఓటమి భయంతో మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ ను ఆయన ఫ్యామిలీపై నోరుపారేసుకోవడం దీన్నే సూచిస్తోందని అంటున్నారు. నరేంద్రమోడీ ఐదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయిందని ఆయన ప్రసంగాలను చూస్తే అర్థమవుతోంది. మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు నోట్లరద్దు, జీఎస్టీతో దేశం దివాళా తీసింది. వందలాది పరిశ్రమలు కుదేలై మూతపడ్డాయి. జనం పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల ఎదుట క్యూలు […]
మోడీ తీరు చూస్తుంటే రోజులు దగ్గరపడ్డట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సద్వివిమర్శలు మాని ఓటమి భయంతో మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ ను ఆయన ఫ్యామిలీపై నోరుపారేసుకోవడం దీన్నే సూచిస్తోందని అంటున్నారు.
నరేంద్రమోడీ ఐదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయిందని ఆయన ప్రసంగాలను చూస్తే అర్థమవుతోంది.
మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు నోట్లరద్దు, జీఎస్టీతో దేశం దివాళా తీసింది. వందలాది పరిశ్రమలు కుదేలై మూతపడ్డాయి. జనం పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల ఎదుట క్యూలు కట్టారు. ఇప్పటికీ ఏటీఎంలలో నగదు లేకుండా పోయింది.
అందుకే ఇప్పుడు 5 విడతలు దగ్గరికి వచ్చేసరికి పోలింగ్ సరళి చూశాక మోడీకి కౌంట్ డౌన్ మొదలైందని.. ఆయన ఓటమి తథ్యమన్న అంచనాలు నెలకొన్నాయి. ఐదేళ్ల పాలనలో మోడీ చేసిందేమీ లేదని.. మరో 16రోజుల్లో మోడీపాలనకు తెరపడబోతోందని ప్రజాస్వామ్యం వర్దిల్లబోతోందని సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ జోస్యం చెప్పారు.