ఎన్నికల ఎఫెక్ట్ : న్యూస్ ఛానల్స్‌కు భారీగా పెరిగిన వీక్షకులు
ఇండియాలో టీవీలు చూసే వారి సంఖ్య దాదాపు 85 కోట్లు. వీరిలో ఎంటర్‌టైన్‌మెంట్, సినిమా, స్పోర్ట్స్, మ్యూజిక్ ఛానల్స్ చూసేవారే అధికం. యాడ్ రెవెన్యూ కూడా ఈ జానర్ ఛానల్స్‌కు ఎక్కువగా ఉంటుంది. ఇక న్యూస్ ఛానల్స్ విషయానికి వస్తే.. వీటిని వీక్షించే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇండియాలో ఉన్న జాతీయ, ప్రాంతీయ న్యూస్ ఛానల్స్‌లో…. లాభాల్లో ఉన్నవి వేళ్ల మీద లెక్కపెట్ట వచ్చు. వీటిలో యాడ్స్ ద్వారా ఎక్కువగా సంపాదించేవి టాప్ 5 ఛానల్స్ […]
ఇండియాలో టీవీలు చూసే వారి సంఖ్య దాదాపు 85 కోట్లు. వీరిలో ఎంటర్‌టైన్‌మెంట్, సినిమా, స్పోర్ట్స్, మ్యూజిక్ ఛానల్స్ చూసేవారే అధికం. యాడ్ రెవెన్యూ కూడా ఈ జానర్ ఛానల్స్‌కు ఎక్కువగా ఉంటుంది. ఇక న్యూస్ ఛానల్స్ విషయానికి వస్తే.. వీటిని వీక్షించే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇండియాలో ఉన్న జాతీయ, ప్రాంతీయ న్యూస్ ఛానల్స్‌లో…. లాభాల్లో ఉన్నవి వేళ్ల మీద లెక్కపెట్ట వచ్చు. వీటిలో యాడ్స్ ద్వారా ఎక్కువగా సంపాదించేవి టాప్ 5 ఛానల్స్ మాత్రమే.
కాగా, ఈ ఏడాది భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు, పుల్వామా ఘటన, అభినందన్‌ను పాకిస్తాన్ అప్పగించడం, ఎన్నికలు తదితర కారణాల రిత్యా న్యూస్ ఛానల్స్ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బార్క్) రేటింగ్ ప్రకారం ఈ ఏడాది 17వ వారానికి (అంటే ఏప్రిల్ 20 నుంచి 26) టాప్ హిందీ న్యూస్ ఛానల్స్ చూసే వాళ్ల సంఖ్య ఏకంగా 66 శాతం పెరిగింది. టాప్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వ్యూవర్స్‌లో 22 శాతం పెరుగుదల ఉన్నట్లు బార్క్ లెక్కలు చెబుతున్నాయి.
ఈ ఏడాది ట్రాయ్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం ప్రేక్షకులు కోరుకున్న ఛానల్సే వారికి అందిస్తున్నారు. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాతే న్యూస్ ఛానల్స్ వీక్షకుల సంఖ్య పెరగడం గమనార్హం. కీలకమైన లోక్‌సభ ఎన్నికల వల్ల కేవలం న్యూస్ మాత్రమే కాక ప్రైమ్ టైంలో ప్రసారమయ్యే చర్చా కార్యక్రమాలు, విశ్లేషణల వల్ల న్యూస్ చూసే వారి శాతం పెరిగిందని తెలుస్తోంది.
ఇక న్యూస్ ఛానల్స్ ఆదాయం కూడా 40 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్ల డేటాను తీసుకుంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు సమకూరిన ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎన్నికల ర్యాలీల కవరేజి, పోలింగ్ తేదీల్లో న్యూస్ ఛానల్స్‌కు ఆదాయం పెరిగింది.
మరోవైపు పుల్వామా ఘటన తర్వాత కూడా న్యూస్ ఛానల్స్ యాడ్-రెవెన్యూ పెరిగినట్లు రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాన్ చందానీ పేర్కొన్నారు.
జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువ ఆదాయాన్ని అర్జించిన వార్తా ఛానెల్స్.. మే నెలపై దృష్టి పెట్టాయి. ఈ నెలలో మిగిలిన అన్ని దశల పోలింగ్ పూర్తవడంతో పాటు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఆఖరి దశ తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్, పోల్ సర్వేల ద్వారా మరింత యాడ్ జనరేట్ అవుతుందని భావిస్తున్నాయి. కాబట్టి ఈ నెలలో మరింత అర్జించడం ఖాయమనే తెలుస్తోంది. ఏదేమైనా ఒక వైపు చిన్నచిన్న ఛానల్స్ మూతపడుతుంటే టాప్ ఛానల్స్ మాత్రం ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాయి.