గట్టు మారుతున్న పందెం రాయుళ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీన్ గంట గంటకు మారిపోతోంది. నిన్నటి వరకూ ఓ పార్టీకి మద్దతుగా మాట్లాడిన వారు మర్నాడు మరో పార్టీకి దన్నుగా మారుతున్నారు. క్షణం క్రితం వరకూ అధికారం మాదే అన్న వారు మరికొంత సమయం తర్వాత వారిలో వారు లెక్కలు వేసుకుంటూ “అబ్బే మేం అటు లేం ” అంటున్నారు. ఇది సామాన్యులతో పాటు ఎన్నికల ఫలితాలపై కోట్లకు కోట్లు పందాలు కాసుకున్న వారిలో కూడా కనిపిస్తోంది. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి […]

Advertisement
Update:2019-05-06 02:29 IST

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీన్ గంట గంటకు మారిపోతోంది. నిన్నటి వరకూ ఓ పార్టీకి మద్దతుగా మాట్లాడిన వారు మర్నాడు మరో పార్టీకి దన్నుగా మారుతున్నారు. క్షణం క్రితం వరకూ అధికారం మాదే అన్న వారు మరికొంత సమయం తర్వాత వారిలో వారు లెక్కలు వేసుకుంటూ “అబ్బే మేం అటు లేం ” అంటున్నారు.

ఇది సామాన్యులతో పాటు ఎన్నికల ఫలితాలపై కోట్లకు కోట్లు పందాలు కాసుకున్న వారిలో కూడా కనిపిస్తోంది. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పందెం రాయుళ్లకు మంచి పని తగిలింది.

నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అధికార తెలుగుదేశం పార్టీది విజయం అని కొందరు పందాలు కాసారు. అయితే ఈసారి ప్రతిపక్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మరికొందరు పందాలు కాసారు. మధ్యలో పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి వచ్చిన తర్వాత మళ్లీ పందాలు మారిపోయాయంటున్నారు.

ఆయన పోటీలో ఉంటామని చెప్పడంతో తెలుగుదేశం తరపున పందాలు కాసిన వారు కాసింత వెనక్కి తగ్గారంటున్నారు. జనసేన ఓట్లు గతంలో తెలుగుదేశం పార్టీకి పడ్డాయని, వాటితోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని ప్రచారం జరిగింది. దీంతో ఈసారి పవన్ కల్యాణ్ నేరుగా పోటీలో ఉండడంతో తెలుగుదేశం పార్టీకి భారీగా ఓట్ల చీలిక తప్పదని భావించారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను తెలుగుదేశం, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రకటించగానే మళ్లీ పందెం రాయుళ్లు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. ఎక్కువగా తెలుగుదేశం తరఫున పందాలు కాసిన వారు తెలుగుదేశం అభ్యర్ధులను ఎంపిక చేయగానే వారి పందాలు తగ్గించుకోవడమో… లేక పందాల బరిలో నుంచి తొలగిపోవడమో చేశారంటున్నారు.

పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగు సరళిని చూసిన పందెం రాయుళ్లు మళ్లీ తెలుగుదేశం వైపు కాసింత మొగ్గు చూపారని తెలుస్తోంది. పోలింగ్ కు మహిళలు ఎక్కువ మంది రావడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

ఇది ఓ వారం రోజుల పాటు నడిచినా ఆ తర్వాత మహిళలకు పసుపు – కుంకుమ అందలేదని, పైగా కొందరికి వచ్చి ఎక్కువ మందికి అందకపోవడంతో వారంతా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకే బారులు తీరారని చెబుతున్నారు. ఈ కొత్త ప్రచారంతో బెంబేలెత్తిన పందెం రాయుళ్లు మళ్లీ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ అభ్యర్ధులతో జరుపుతున్న సమావేశాల వివరాలు తెలుసుకుంటున్న పందెంరాయుళ్లు చాలా మంది తెలుగుదేశం గట్టు దిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

పందెం కాసిన వారు మధ్యలో విరమించుకుంటే పందెంలో 25 శాతం వదులుకోవాల్సి ఉంటుంది. అంటే లక్షరూపాయలు పందెం కాస్తే అందులో 25 వేల రూపాయలు వదులుకోవడానికి సిద్ధపడాలి. పోతే 25 శాతంతో పోతుంది అనే ఆలోచనతో ఎక్కువ మంది పందెం రాయుళ్లు తెలుగుదేశంకి మద్దతుగా కాసిన పందేల నుంచి వైదొలగుతున్నట్లు సమాచారం.

పందేలకు మధ్యవర్తులుగా ఉండి కమిషన్ తీసుకునే వారికి సంకట స్థితి ఏర్పడుతోంది అంటున్నారు. దీనికి కారణం ప్రతి ఒక్కరూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీపై పందెం కాస్తే ప్రత్యర్ధులు ఎవరుంటారనేది వారి తలపోటుగా మారిందంటున్నారు.

Tags:    
Advertisement

Similar News