సమీక్షలెందుకు బాబూ... ఆదుకోవాలి కాని...!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సమీక్షలు తప్ప ఇంకేమీ పట్టనట్లుగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు ఫొని తుపాను విలయం సృష్టిస్తోంది. దాదాపుగా ఉత్తరాంధ్రను వణికిస్తోంది. ఈ తరుణంలో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టేలా సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన చంద్రబాబు, తాను సమీక్షలు చేపట్టడానికి అనుమతి ఇవ్వడం లేదంటూ ఈసీ మీద మండిపడుతున్నారు. దీనంతటికీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడే కారణమని దుమ్మెత్తి పోస్తున్నాడు. చంద్రబాబు తీరును పలువురు తప్పు పడుతున్నారు. తుపాను సహాయక చర్యలు […]

Advertisement
Update:2019-05-03 04:09 IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సమీక్షలు తప్ప ఇంకేమీ పట్టనట్లుగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు ఫొని తుపాను విలయం సృష్టిస్తోంది. దాదాపుగా ఉత్తరాంధ్రను వణికిస్తోంది. ఈ తరుణంలో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టేలా సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన చంద్రబాబు, తాను సమీక్షలు చేపట్టడానికి అనుమతి ఇవ్వడం లేదంటూ ఈసీ మీద మండిపడుతున్నారు. దీనంతటికీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడే కారణమని దుమ్మెత్తి పోస్తున్నాడు.

చంద్రబాబు తీరును పలువురు తప్పు పడుతున్నారు. తుపాను సహాయక చర్యలు చేపట్టేందుకు సమీక్షలు చేయాల్సిన అవసరం లేదని, అధికారులు తీసుకుంటున్న సహాయ, పునరావాస చర్యలకు అండగా ఉంటే చాలంటున్నారు. రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినపుడు తగిన విధంగా స్పందించగలిగిన శక్తి సామర్థ్యాలు అధికార యంత్రాంగానికి ఉన్నాయని అంటున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడిగా వారికి మార్గదర్శనం చేస్తే సరిపోదా? అని ప్రశ్నిస్తున్నారు.

సమీక్షలు అంటూ పెడితే కాలయాపన తప్ప మరే ప్రయోజనమూ ఉండదంటున్నారు. తుపానులాంటి విపత్తులు సంభవించినపుడు నిజానికి క్షేత్రస్థాయిలో ప్రజల బాధలు తీర్చేది స్థానిక అధికారులే.

వారికి కావలసిన సౌకర్యాలు, వస్తువులు….. పాలకులు సమకూర్చితే సరిపోతుంది. మిగతా విషయాలు అధికారులే చూసుకుంటారు. ఇది చంద్రబాబుకు తెలియంది కాదు.. కానీ, ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడం ఆయనకు అలవాటనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ పరిణామాలతో పలువురు అధికారులు తమ విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. తాము ఏ చర్యలు తీసుకున్నా, అవి ఎటు పోయి ఎటు వస్తాయోనని వారు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.

దీంతో అంతిమంగా నష్టం జరిగేది ప్రజలకేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. అధికారులు స్వేచ్ఛగా పని చేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పాలకులదేనని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News