600 గోల్స్ మొనగాడు లయనల్ మెస్సీ
బార్సిలోనా క్లబ్ తరపున మెస్సీ సరికొత్త రికార్డు లివర్ పూల్ పై 7 నిముషాల వ్యవధిలో మెస్సీ రెండు గోల్స్ అర్జెంటీనా కమ్ బార్సిలోనా సాకర్ కింగ్ లయనల్ మెస్సీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బార్సిలోనా క్లబ్ తరపున 600 గోల్స్ సాధించిన అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు. చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్స్ తొలి అంచె పోటీలో లివర్ పూల్ క్లబ్ తో ముగిసిన పోటీలో…బార్సిలోనా 3-0 గోల్స్ విజయం సాధించింది. ఇందులో రెండు గోల్స్ మెస్సీ […]
- బార్సిలోనా క్లబ్ తరపున మెస్సీ సరికొత్త రికార్డు
- లివర్ పూల్ పై 7 నిముషాల వ్యవధిలో మెస్సీ రెండు గోల్స్
అర్జెంటీనా కమ్ బార్సిలోనా సాకర్ కింగ్ లయనల్ మెస్సీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బార్సిలోనా క్లబ్ తరపున 600 గోల్స్ సాధించిన అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు.
ఆట రెండో భాగంలో…కేవలం ఏడు నిముషాల వ్యవధిలోనే మెస్సీ వెంట వెంటనే రెండుగోల్స్ సాధించడం ద్వారా…తన కెరియర్ గోల్స్ ను 600కు పెంచుకొన్నాడు.
గత కొద్ది సంవత్సరాలుగా బార్సిలోనా క్లబ్ కు మాత్రమే ఆడుతూ వస్తున్న మెస్సీ…కేవలం ఓ క్లబ్ తరపునే 600 గోల్స్ సాధించిన మొనగాడిగా నిలిచాడు.
మెస్సీ సాధించిన మొత్తం 600 గోల్స్ లో 496 లెఫ్ట్ ఫుట్ గోల్స్, 24 హెడ్డర్లు, 78 రైట్ ఫుట్ గోల్స్, రెండు ఇతర గోల్స్ ఉన్నాయి.