వేలు వాసన వస్తేనే.... ఓటుకు నోటు
నాయకులుగా ఎన్నికయ్యాక ఈ తెలివితేటలన్నీ ఎక్కడికి పోతాయో తెలియదు గానీ…. ఎన్నికల సమయంలో మాత్రం నాయకుల బుర్రలు అమోఘంగా పనిచేస్తాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంలో భారతదేశంలోనే మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్‌కు దక్కుతుంది. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం, మందు తాపడం గొప్ప విజన్ గా మారింది కొందరు నాయకులకు. ఇలా చేసే వాళ్ళను విమర్శించడానికి బదులు పోల్ మేనేజ్ మెంట్ లో తిరుగులేని వ్యక్తులుగా కీర్తిస్తోంది మీడియా. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఓటర్లకు పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వడం ప్రారంభం […]
నాయకులుగా ఎన్నికయ్యాక ఈ తెలివితేటలన్నీ ఎక్కడికి పోతాయో తెలియదు గానీ…. ఎన్నికల సమయంలో మాత్రం నాయకుల బుర్రలు అమోఘంగా పనిచేస్తాయి.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంలో భారతదేశంలోనే మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్‌కు దక్కుతుంది. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం, మందు తాపడం గొప్ప విజన్ గా మారింది కొందరు నాయకులకు.
ఇలా చేసే వాళ్ళను విమర్శించడానికి బదులు పోల్ మేనేజ్ మెంట్ లో తిరుగులేని వ్యక్తులుగా కీర్తిస్తోంది మీడియా. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఓటర్లకు పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వడం ప్రారంభం అయ్యాక…. మళ్ళీ వాళ్లు తమకు ఓటు వేస్తారో… లేదో… అన్న అనుమానంతో…. వాళ్ళ చేత దేవుడిమీద, పిల్లలమీద, తినే అన్నం మీద ప్రమాణం చేయించుకుంటూ…. అలా ముందుకు వెళ్తున్నారు పోల్ మేనేజ్ మెంట్ లో.
ఇప్పుడు పశ్చిమబెంగాల్ లో ఒక నాయకుడు అంతకన్నా ముందుకు వెళ్ళిపోయి…. ఇంతవరకూ దేశంలో ఎవ్వరూ చేయని ఓ సరికొత్త ప్రయోగం చేశాడు. ఓటుకు నోటు ఇచ్చాక…. ఆ ఓటు తనకు వేశారో లేదో తెలుసుకోవడానికి…. వింత పోకడ పోయాడు. అక్కడ బూత్ లలో ఓటు హక్కు ఉన్న తమ కార్యకర్తలను మధ్య మధ్యలో పంపి తన పార్టీ సింబల్ మీద అత్తర్ పూయించాడు.
ఆ తరువాత తను ఓటుకు నోటు ఇచ్చిన ఓటర్లను ఓటు వేయమని పంపాడు. వాళ్ళు బూత్ నుంచి బయటకు రాగానే తనకే ఓటు వేశారో లేదో చెక్ చేయడానికి వాళ్ళ చూపుడు వేలును వాసన చూసే బాధ్యతను తన కార్యకర్తలను అప్పగించాడు. వాసన వస్తే తనకు ఓటు వేసినట్టు…. లేకపోతే తనకు ఓటు వేయనట్టు.
ఇలాంటి తెలివితేటల్లో మనవాళ్ళను మించిపోయేటట్లున్నారు బెంగాలీలు.