కమ్యూనిస్టులు కనుమరుగేనా ?

కమ్యూనిస్టు పార్టీలు. తెలుగు రాష్ట్రాలలో ఓ వెలుగు వెలిగిన పార్టీలు. ప్రజా ఉద్యమాలతో పేరు తెచ్చుకున్న వారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ఉద్యమాలతో నేరుగా సంబంధాలు కల వారు. ఆదర్శాలకు, విలువలకు ప్రాణం పెట్టేవారు. తెలుగు ప్రజలకు కూడా కమ్యూనిస్టు పార్టీల పట్ల ఎంతో సానుభూతి ఉంది. అయితే ఇదంతా గతంలో. ఆ కీర్తి కూడా గత వైభవంలా మారిపోతోంది. కమ్యూనిస్టుల కీర్తి మంచు కొండలా కరిగి పోతోంది. ఇటీవల జరిగిన […]

Advertisement
Update:2019-04-22 05:07 IST

కమ్యూనిస్టు పార్టీలు. తెలుగు రాష్ట్రాలలో ఓ వెలుగు వెలిగిన పార్టీలు. ప్రజా ఉద్యమాలతో పేరు తెచ్చుకున్న వారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ఉద్యమాలతో నేరుగా సంబంధాలు కల వారు. ఆదర్శాలకు, విలువలకు ప్రాణం పెట్టేవారు. తెలుగు ప్రజలకు కూడా కమ్యూనిస్టు పార్టీల పట్ల ఎంతో సానుభూతి ఉంది.

అయితే ఇదంతా గతంలో. ఆ కీర్తి కూడా గత వైభవంలా మారిపోతోంది. కమ్యూనిస్టుల కీర్తి మంచు కొండలా కరిగి పోతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ఓటు బ్యాంక్ రాజకీయాలలో కమ్యూనిస్టు పార్టీలు సత్తా చాటుకోలేక చతికిల బడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం ఉనికి తెలుగు రాష్ట్రాలలో లేకుండా పోయే పరిస్ధితి ఎదురయ్యింది.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపిన కమ్యూనిస్టు పార్టీలు వాటి మనుగడకే ముప్పు తెచ్చుకునే పరిస్ధితి వచ్చింది. తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండేది. ఆ జిల్లాలలో కమ్యూనిస్టు పార్టీలకు తమదైన ఓటు బ్యాంకు ఉండేది. ఇటీవల కాలంలో ఆ ఓట్ బ్యాంక్ చెల్లాచెదురయ్యిందని కమ్యూనిస్టు పార్టీ నాయకులే చెబుతున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయవాడ పట్టణం, అనంతపురం, కర్నూలు జిల్లాలలో కమ్యూనిస్టు పార్టీలకు మంచి క్యాడర్ ఉండేది. ఆ జిల్లాలలో ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీల సానుభూతి పరులు ఉన్నారు. అయితే అక్కడ కూడా పరిస్థితి తారుమారు అయ్యింది. దీనికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్న కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో విఫలం కావడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దశాబ్దాల చరిత్ర కలిగిన వామపక్ష పార్టీలు ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ముందు సీట్ల కోసం చేతులు కట్టుకుని నిలబడ్డారని, ఇది ఆ పార్టీల తిరోగమనానికి సూచిక అని అంటున్నారు. కమ్యూనిస్టు పార్టీలు సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితులు ఇప్పట్లో కనిపించవని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News