ఆ బంగారం పై ఇతర దేశాల ముద్రలు ఎలా వచ్చాయి?

తమిళనాడులో పోలీసుల తనిఖీలో దొరికిన బంగారం పై అనుమానం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. స్వామి వారి బంగారం పై ఇతర దేశాల ముద్రలు ఉన్నాయని…. ఆ ముద్రలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి భద్రత లేకుండా తిరుమలేశుడి 1381 కేజీల బంగారాన్ని ఎలా తరలిస్తారని…. తిరుమల-తిరుపతి దేవస్థానం ఆస్తులకు, బంగారు ఆభరణాలకు భద్రత కరువైందని…. స్వామివారి ఆభరణాలు, కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు ఆనం. వెంకటేశ్వర […]

Advertisement
Update:2019-04-22 12:05 IST

తమిళనాడులో పోలీసుల తనిఖీలో దొరికిన బంగారం పై అనుమానం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. స్వామి వారి బంగారం పై ఇతర దేశాల ముద్రలు ఉన్నాయని…. ఆ ముద్రలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.

ఎలాంటి భద్రత లేకుండా తిరుమలేశుడి 1381 కేజీల బంగారాన్ని ఎలా తరలిస్తారని…. తిరుమల-తిరుపతి దేవస్థానం ఆస్తులకు, బంగారు ఆభరణాలకు భద్రత కరువైందని…. స్వామివారి ఆభరణాలు, కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు ఆనం. వెంకటేశ్వర స్వామి ఆస్తులను తానే కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

శ్రీవారి బంగారు ఆభరణాల తరలింపు పై అనేక అనుమానాలు ఉన్నాయని…. స్వామివారి విలువైన బంగారు ఆభరణాలను తరలిస్తుంటే భద్రత ఎందుకు ఏర్పాటు చెయ్యలేదని ప్రశ్నించారాయన.

నిగ్గుతేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మీద ఉందని…. గడిచిన ఐదేళ్లలో టిటిడిలో జరిగిన అవినీతి, దోపిడీని బయటపెట్టాలని ప్రధాన కార్యదర్శిని కోరారు.

ఆర్థిక శాఖా మంత్రి రామకృష్ణుడు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని…. పరిపాలన చివరి దశకు రావడంతో చంద్రబాబు మితిమీరిన అవినీతికి పాల్పడుతున్నారన్నారు ఆనం.

ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారని…. ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేశారని…. కడుపులో ఉన్న బిడ్డ తలమీద కూడా లక్ష రూపాయల అప్పు ఉందని అన్నారాయన.

ప్రభుత్వ ఆర్థిక శాఖను ఒక ప్రవేట్ ఏజెన్సీ నడిపిందని…. ప్రభుత్వ నిధుల వినియోగాన్ని ఎన్ ఆర్ ఐ వాసిరెడ్డి కృష్ణ దేవరాయలు డీల్ చేశారని…. రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగిన దోపిడీలో అసలైన దోషులను నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉందని…. కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా దర్యాప్తు చెయ్యాలని కోరారాయన.

Tags:    
Advertisement

Similar News