పాపం... తెలంగాణ కాంగ్రెస్...
తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. రాజకీయ పునరేకీకరణ పేరిట చేరికలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా, నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. టీ కాంగ్రెస్ నేతలు బీరాలు పలకడం, దిక్కులు చూడడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. తాజాగా సంగారెడ్డి, భూపాలపల్లి, భద్రాచలం ఎమ్మెల్యేలు జెగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పొదెం వీరయ్య గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు 24వ తేదీన […]
తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. రాజకీయ పునరేకీకరణ పేరిట చేరికలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా, నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. టీ కాంగ్రెస్ నేతలు బీరాలు పలకడం, దిక్కులు చూడడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. తాజాగా సంగారెడ్డి, భూపాలపల్లి, భద్రాచలం ఎమ్మెల్యేలు జెగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పొదెం వీరయ్య గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.
ఇందుకు 24వ తేదీన ముహూర్తం ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఇక తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. క్షేత్రస్థాయిలో అతి కీలకమైన పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయిన రోజే ఈ పరిణామం సంభవించడం కాంగ్రస్ కు అశనిపాతమే అని చెప్పక తప్పదు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆ పార్టీ పెద్దగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు.
ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రాణం పోయినా కాంగ్రెస్ ను వీడేది లేదని ప్రకటించారు. ఏమైందో తెలియదు కానీ, అంతలోనే వారు కారెక్కేందుకు రెడీ అయిపోయారు. మరోవైపు ఇటు టీఆర్ఎస్ పార్టీలోనూ అంతర్గతంగాఈ చేరికలపై పెద్ద చర్చే జరుగుతోంది. కానీ, ఎవ్వరూ నోరు విప్పి బయటకు చెప్పడానికి సాహసించడం లేదు. మొత్తానికి రాష్ట్రంలో పాలనా పరంగా భారీసంస్కరణలు తీసుకురావడానికి యత్నిస్తున్న సీఎం కేసీఆర్ అందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షానికి తగిన బలం లేకపోతే తన ప్రయత్నాలకు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్ఛని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు అయినా పార్టీలో ఉంటారా? సహచారుల బాటనే ఎంచుకుంటారా? వేచి చూడాల్సిందే.