రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు రావడానికి మరో నెల రోజుల సమయం మిగిలి ఉంది. ఈలోగా ఎవరికి వారు తమ అంచనాలను వేసుకుంటున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని నారా చంద్రబాబు నాయుడు నమ్మకంగా చెబుతున్నారు. పార్టీ నాయకులకు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కూడా గెలుపు మనదే అంటూ పూట పూటా భరోసా ఇస్తున్నారు. తాము విజయం సాధించే అవకాశాలు తక్కువే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు, అభ్యర్థులు […]

Advertisement
Update:2019-04-21 00:32 IST

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు రావడానికి మరో నెల రోజుల సమయం మిగిలి ఉంది. ఈలోగా ఎవరికి వారు తమ అంచనాలను వేసుకుంటున్నారు.

అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని నారా చంద్రబాబు నాయుడు నమ్మకంగా చెబుతున్నారు. పార్టీ నాయకులకు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కూడా గెలుపు మనదే అంటూ పూట పూటా భరోసా ఇస్తున్నారు. తాము విజయం సాధించే అవకాశాలు తక్కువే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు, అభ్యర్థులు చెబుతుంటే చంద్రబాబు మాత్రం గెలుపు ఖాయమని అంటున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై నిర్వహించిన వివిధ సర్వేలు మాత్రం ఈసారి అధికారంలోకి వచ్చేది వైయస్ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారు. సర్వేలతోపాటు తీర్పు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరవుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. ఆ రిటర్న్ గిఫ్ట్ అర్థం వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరు కావడమేనని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మే నెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. తెలంగాణలో లోక్ సభ ఫలితాలు మాత్రమే వస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం శాసనసభ ఫలితాలు కూడా ఆరోజే వెల్లడవుతాయి. 23వ తేదీ మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుంది. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా విజయం సాధిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఇప్పటికే ప్రకటించారు.

దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరై తన చిరకాల శత్రువు నారా చంద్రబాబు నాయుడు కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని అంటున్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తాం అని చెబుతున్న చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కావడమేనని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News