నేల నుంచి నింగికి చేరిన.... కోడెల దందా
ఇప్పటికే నరసరావుపేట తదితర ప్రాంతాల్లో అనేక దందాలతోపాటు ఫ్యామిలీ ట్యాక్స్ వసూలు చేస్తున్న కోడెల ఫ్యామిలీ ఇవి చాలవన్నట్టు శాటిలైట్ పైరసీతో అక్రమాలకు పాల్పడింది. అక్రమంగా ఆయా శాటిలైట్ ఛానళ్ళ ప్రసారాలను అందించి డబ్బు చేసుకుంటున్న కోడెల కొడుకుపై ఆ ఛానల్ నిర్వాహకులు ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దాంతో ఢిల్లీ హైకోర్టు కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ శాటిలైట్ పైరసీ ద్వారా కోడెల శివరామకృష్ణ దాదాపు సంవత్సరానికి 6 కోట్ల రూపాయలకు పైగా వెనకేసుకుంటున్నాడని ఈ […]
ఇప్పటికే నరసరావుపేట తదితర ప్రాంతాల్లో అనేక దందాలతోపాటు ఫ్యామిలీ ట్యాక్స్ వసూలు చేస్తున్న కోడెల ఫ్యామిలీ ఇవి చాలవన్నట్టు శాటిలైట్ పైరసీతో అక్రమాలకు పాల్పడింది.
అక్రమంగా ఆయా శాటిలైట్ ఛానళ్ళ ప్రసారాలను అందించి డబ్బు చేసుకుంటున్న కోడెల కొడుకుపై ఆ ఛానల్ నిర్వాహకులు ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దాంతో ఢిల్లీ హైకోర్టు కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ శాటిలైట్ పైరసీ ద్వారా కోడెల శివరామకృష్ణ దాదాపు సంవత్సరానికి 6 కోట్ల రూపాయలకు పైగా వెనకేసుకుంటున్నాడని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ఆ కమిషన్ గురువారం నాడు కోడెల ఇంటిలో ‘గౌతమ్ కమ్యూనికేషన్’ పేరిట నడుస్తున్న ‘కే’ ఛానల్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు.
మొదట స్థానిక తెలుగుదేశం నాయకులు వీళ్ళను కోడెల ఇంటిలోకి పోనివ్వకుండా అడ్డుకున్నారు. అయితే కోర్టు ఆర్డర్ చూపించడంతో తెలుగుదేశం నాయకులు వెనక్కి తగ్గారు. పోలీసులు కూడా సహకరించారు.
ఎప్పటినుంచో శాటిలైట్ పైరసీకి పాల్పడుతూ అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న స్పీకర్ కోడెల తనయుడు శివరామకృష్ణ పై స్టార్ ప్లస్ ప్రతినిధులు రెండేళ్ళ క్రితమే టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పీకర్ పలుకుబడికి బయపడి కేసును నమోదు చేయలేదు. దీంతో స్టార్ ప్లస్ ప్రతినిధులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
దీనికి స్పందించిన ఢిల్లీ హైకోర్టు శాటిలైట్ పైరసీపై విచారణ జరిపి పూర్తి నివేదికను తమకు ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది.
ఈ సోదాలలో శాటిలైట్ పైరసీకి ఉపయోగించిన ఎన్‌కోడర్, సెట్ టాప్ బాక్స్‌లను, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు…. సాక్ష్యాలుగా వీటిని కోర్టుకు సమర్పించనున్నారు.
గతంలో ఒక ప్రముఖ జాతీయ ఆంగ్ల దిన ప్రతిక…. కోడెల తనయుడు కోడెల శివరామకృష్ణ అరచకాలు, ఆక్రమాలు, ఆయన చేసిన కిడ్నాపులు, దందాలపై…. ”ఆంధ్రా నయీమ్” అని సంభోదిస్తూ కోడెల తనయుడిపై ఒక పెద్ద వ్యాసాన్నే ప్రచురించింది.