రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, సుశాంత్ లకు పోటీగా కీర్తి సురేష్

టాలీవుడ్ లో సినిమాల పరంగా చూస్తే గతేడాది 2018 లో బోలెడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు రికార్డుల మోత మోగిస్తే, అసలు అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇక తాజాగా 2018 లో బ్లాక్ బస్టర్ సినిమాలలో నేషనల్ అవార్డ్ ఏ సినిమాని వరిస్తుందో అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వచ్చే వారం […]

Advertisement
Update:2019-04-19 06:08 IST

టాలీవుడ్ లో సినిమాల పరంగా చూస్తే గతేడాది 2018 లో బోలెడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు రికార్డుల మోత మోగిస్తే, అసలు అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.

ఇక తాజాగా 2018 లో బ్లాక్ బస్టర్ సినిమాలలో నేషనల్ అవార్డ్ ఏ సినిమాని వరిస్తుందో అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వచ్చే వారం మంగళవారం నాడు జాతీయ అవార్డులను ప్రకటించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం బెస్ట్ రీజనల్ ఫిలిం (తెలుగు) లో నాలుగు సూపర్ హిట్ సినిమాలను కన్సిడర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవే ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘చి ల సౌ’, ‘గీత గోవిందం’. అలనాటి తార సావిత్రి బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహానటి’ సినిమా లో కీర్తి సురేష్ అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

మరోవైపు రామ్ చరణ్ చెవిటి వాడి గా నటించిన ‘రంగస్థలం’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డ్స్ లను బద్దలుకొట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని సాధించింది సుశాంత్ నటించిన ‘చిలసౌ’ సినిమా.

విడుదలకు ముందే సగం సినిమా లీక్ అయినప్పటికీ ‘గీత గోవిందం’ సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్లు తెచ్చి పెట్టింది. మరి ఈ నాలుగు సినిమాలలో జాతీయ అవార్డు దేనికి వెళుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News