రెండో దశ.... అందలం ఎక్కిస్తుందా?

కేంద్రంలో అధికార పగ్గాలు అందుకునేందుకు కీలకమైన రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలలోని 95 నియోజకవర్గాలలో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా 91లోక్ సభ నియోజకవర్గాలకు ఈ నెల 11న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడతగా 12 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్ర్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లోని  లోక్ సభ స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు లోని 39 స్దానాలలో… 38 స్దానాలకు నేడు పోలింగ్ […]

Advertisement
Update:2019-04-18 02:38 IST

కేంద్రంలో అధికార పగ్గాలు అందుకునేందుకు కీలకమైన రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలలోని 95 నియోజకవర్గాలలో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా 91లోక్ సభ నియోజకవర్గాలకు ఈ నెల 11న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడతగా 12 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇందులో దక్షిణాది రాష్ట్ర్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లోని లోక్ సభ స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు లోని 39 స్దానాలలో… 38 స్దానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. వేలూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు వెదజల్లుతున్నారనే కారణంగా ఇక్కడ ఎన్నికను వాయిదా వేసారు. దీంతో 38 నియోజక వర్గాలలో పోలింగ్ జరుగుతోంది.

దక్షిణాదిన మరో రాష్ట్రమైన కర్ణాటకలో 28 స్దానాలలో 14 స్దానాలకు రెండో దశలో పోలింగ్ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్ర్రంగా పేరున్న ఉత్తర్ ప్రదేశ్ లోని 80 స్దానాలలో 8 లోక్ సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. రెండో దశ పోలింగ్ లో బిహార్, అసోమ్, ఛత్తీస్ గఢ్, జమ్మూ- కాశ్మీర్, మహారాష్ట్రలలో పోలింగ్ జరుగుతుంది. ఇవికాక ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్ర్రమైన ఒడిసా, మణిపూర్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ లలో రెండో దశలో పోలింగ్ జరుగుతుంది.

రెండో దశలో జరుగుతున్న ఈ ఎన్నికలలో అతిరధ మహారధులు పోటీలో ఉన్నారు. వారిలో మాజీ ప్రధాని దేవేగౌడ, కేంద్ర మాజీ మంత్రులు ఫరూక్ అబ్దుల్లా, కనిమొళి, సినీ తారలు హేమమాలిని, ప్రకాశ్ రాజ్ పోటీలో ఉన్నారు. తొలిదశ పోలింగ్ భారతీయ జనతా పార్టీకి అనుకూలించదని వార్తలు వచ్చాయి. ఈ తొలిదశలో అధికార బిజేపీకి 5 స్దానాలకు మించి రావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే పరిస్ధితి నేడు రెండో దశలో జరగుతున్న ఎన్నికలలో కూడా ఉందని అంటున్నారు.

తొలి రెండు దశలలోను తమకు అనుకూలంగా లేని రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ భావించిందని, ఈ రెండు దశలలో జరిగే ఓటింగ్ ను బట్టి…. తర్వాత దశ పోలింగ్ పై వ్యూహాలు రూపొందించాలన్నది భారతీయ జనతా పార్టీ ఎత్తుగడగా చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News