తాటి ముంజలు.... వేసవి తాపం స్టాప్

తాటి ముంజలు… ఇవి పల్లెటూర్లలో మాత్రమే దొరుకుతాయని ఓ భ్రమ. కాని ఇప్పుడు పట్టణాలలో, చిన్న చిన్న బస్తీలలో కూడా దొరుకుతున్నాయి. వీటిని ఇంగ్లీషులో ఐస్ యాపిల్ (ice apple) అని పిలుస్తారు. అరటి చెట్టు, కొబ్బరి చెట్టు మానవ జీవితానికి ఎంత ఉపయోగమో తాటి చెట్టు కూడా అంతే ఉపయోగపడుతుంది. తాటి ఆకులు, తాటి మాను, తాటి కల్లు, తాటి వేళ్లు (తేగలు) ఇలా తాటి చెట్టులోని ప్రతి భాగం ఎంతో ఉపయోగం. వీటిని గురించి […]

Advertisement
Update:2019-04-13 02:41 IST

తాటి ముంజలు… ఇవి పల్లెటూర్లలో మాత్రమే దొరుకుతాయని ఓ భ్రమ. కాని ఇప్పుడు పట్టణాలలో, చిన్న చిన్న బస్తీలలో కూడా దొరుకుతున్నాయి.

వీటిని ఇంగ్లీషులో ఐస్ యాపిల్ (ice apple) అని పిలుస్తారు. అరటి చెట్టు, కొబ్బరి చెట్టు మానవ జీవితానికి ఎంత ఉపయోగమో తాటి చెట్టు కూడా అంతే ఉపయోగపడుతుంది.

తాటి ఆకులు, తాటి మాను, తాటి కల్లు, తాటి వేళ్లు (తేగలు) ఇలా తాటి చెట్టులోని ప్రతి భాగం ఎంతో ఉపయోగం. వీటిని గురించి తెలుసుకుందాం.

  • వేసవిలో వంటిలో వేడిని తగ్గించేందుకు తాటి ముంజలు ఎంతో ఉపయోగపడతాయి. వేసవిలో వడ దెబ్బ తగలకుండా కాపాడతాయి.
  • వీటిలో ఉన్న పొటాషియం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. చెడు రక్తాన్ని గుండెకు చేరనివ్వకుండా కాపాడుతుంది.
  • అతిదాహంతో బాధపడుతున్నవారు తాటిముంజలు తింటే దాహార్తి తీరుతుంది.
  • తాటి ముంజలు మలబద్దకాన్ని పోగొట్టి సుఖ విరోచనం అయ్యేందుకు దోహదపడతాయి.
  • డిహైడ్రేషన్, వేసవిలో వచ్చే ఇతర సమస్యల నుంచి ఎంతో ఉపశమనం కలుగజేస్తాయి.
  • మధుమేహం ఉన్న వారు ఎన్ని తాటి ముంజలైనా నిరభ్యంతరంగా తినవచ్చు.
  • వీటిలో ఉండే ఖనిజాలు శరీరంలో ఉన్న విష పదార్ధాలను, వ్యర్దాలను బయటకి పంపడానికి దోహదపడతాయి.
  • తాటి ముంజలలో ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, జింక్ వంటి ఖనిజాలు, ఇతర పోషకాలు అపారంగా ఉన్నాయి.
  • వీటిలో ఉన్న విటమిన్లు, ఇతర పోషకాలు చెడు కొలస్ట్రాల్ ను అదుపు చేసి, మంచి కొలెస్ట్రాల్ ను శరీరానికి అందించడంలో ఉపయోగపడతాయి.
  • అధిక బరువుతో బాధపడుతున్నవారు వేసవిలో తాటి ముంజలు తింటే మరింత బరువు పెరగకుండా ఉంటారు.
  • తాటి ముంజలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. నీరసం, నిసత్తువ ఉన్నవారు వెంటనే తాటి ముంజలను తింటే ఉల్లాసంగా తయారవుతారు.
  • తాటి ముంజలు శరీరానికి కావల్సినంత తేమను అందిస్తాయి. డ్రైస్కిన్ ఉన్న వారు తాటి ముంజల పేస్ట్ ను వంటికి పట్టించి తర్వాత స్నానం చేస్తే శరీరం పట్టులా తయారవుతుంది.
  • కాలిన గాయాలు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యలకు తాటి ముంజుల పేస్ట్ లేపనంలా పనిచేస్తుంది.
  • వీటిలో ఉన్న సాల్యూబుల్ ఫైబర్ మలబద్దకాన్ని నివారించడమే కాకుండా ఇతర వాతాలను అదుపు చేస్తుంది.
  • శరీరంలో ఉండే చక్కెర స్థాయిలను అదపు చేయడంలో తాటి ముంజలు ఎంతో ఉపయోగపడతాయి.
  • తాటి కల్లు దివ్య ఔషదం
  • రక్తంలో ఉన్న మలినాలు తొలగించడమే కాదు… కిడ్నీ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది.
  • తాటి బెల్లం, తాటి తాండ్రలో ఉన్న ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇన్ని ఉపయోగాలున్న తాటి ముంజలను ఈ వేసవిలో తినండీ…. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రకృతిలో ఉన్న పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్దాల గురించి కొద్దిగా అవగాహన ఉంటే చాలు మానవ దేహానికి మందుల అవసరమే రాదు.

Tags:    
Advertisement

Similar News