విడుదలకు సిద్ధమైన 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' 

విప్లవాత్మక సినిమాలు అంటే ముందుగా గుర్తొచ్చేది ఆర్.నారాయణమూర్తి అని చెప్పుకోవచ్చు. ‘కానిస్టేబుల్ వెంకట్రావు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్.నారాయణమూర్తి…. డిజాస్టర్ ను అందుకున్నారు. తాజాగా ఇప్పుడు ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నటించడమే కాక ఆర్.నారాయణమూర్తి ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. తాజాగా ఈ చిత్ర ఈవెంట్ లో మాట్లాడుతూ…. సినిమా టైటిల్ చూస్తేనే…. ఇది ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ గురించి […]

Advertisement
Update:2019-04-10 04:40 IST

విప్లవాత్మక సినిమాలు అంటే ముందుగా గుర్తొచ్చేది ఆర్.నారాయణమూర్తి అని చెప్పుకోవచ్చు. ‘కానిస్టేబుల్ వెంకట్రావు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్.నారాయణమూర్తి…. డిజాస్టర్ ను అందుకున్నారు.

తాజాగా ఇప్పుడు ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నటించడమే కాక ఆర్.నారాయణమూర్తి ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు.

తాజాగా ఈ చిత్ర ఈవెంట్ లో మాట్లాడుతూ…. సినిమా టైటిల్ చూస్తేనే…. ఇది ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ గురించి మరియు రాజకీయ పరిస్థితుల మీద ఆధారితమై కథ నడుస్తుందన్నారు.

అంతేకాక ఈ సినిమాలో ఒక మర్చిపోలేని మెసేజ్ కూడా ఉంటుందని అన్నారు. “ముఖ్యంగా ఈ సినిమాలో నేను ఒక కామన్ మ్యాన్ ఎదుర్కొనే సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాను. సినిమాలో అవే చూపించాను. ఈ సినిమా మొత్తం ప్రజాస్వామ్యం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారు అని కూడా ఈ సినిమాలో చూపిస్తున్నాము” అని అన్నారు నారాయణ మూర్తి.

ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. మరి వేసవిలో ఈ విప్లవాత్మక సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News