చంద్రబాబు, రాధాకృష్ణ లాంటి నీచుల్ని ఎక్కడా చూడబోము....
చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక సిద్దాంతం, విలువలు కలిగిన రాజకీయ నాయకుడు కాదని గతంలో చెప్పానని… ఇప్పుడు కూడా అదే చెబుతున్నానన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు కులమీడియా సృష్టించిన ఒక నాయకుడు మాత్రమే అని విమర్శించారు. చంద్రబాబును నాయకుడిని చేయడంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో కుల పత్రికలు, కుల మీడియా ఒక వారం రోజుల పాటు చంద్రబాబును కనుక చూపించకపోయినట్లయితే ఎనిమిదవ రోజు చంద్రబాబు అనే వ్యక్తి […]
చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక సిద్దాంతం, విలువలు కలిగిన రాజకీయ నాయకుడు కాదని గతంలో చెప్పానని… ఇప్పుడు కూడా అదే చెబుతున్నానన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.
చంద్రబాబు కులమీడియా సృష్టించిన ఒక నాయకుడు మాత్రమే అని విమర్శించారు. చంద్రబాబును నాయకుడిని చేయడంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో కుల పత్రికలు, కుల మీడియా ఒక వారం రోజుల పాటు చంద్రబాబును కనుక చూపించకపోయినట్లయితే ఎనిమిదవ రోజు చంద్రబాబు అనే వ్యక్తి ఉండరన్నారు. కేవలం కుల మీడియా సృష్టించిన వ్యక్తే ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
చంద్రబాబును ఈ మీడియా ఆకాశానికి ఎత్తేస్తోందని, వైసీపీ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నేను మాట్లాడినట్లు ఒక ఆడియో టేప్‌ను సృష్టించారని… అది నా వాయిస్ కాదని చెప్పినా మళ్ళీ మళ్ళీ ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు విజయసాయి రెడ్డి.
ఆ ఆడియో టేప్ లో వాయిస్ నాది కాదని, ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపితే విషయం బయటపడుతుందని నేను చెప్పాను…. దానికి కౌంటర్ గా రాధాకృష్ణ ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ గొంతు విజయసాయిరెడ్డిదేనని నిర్ధారించిందని వార్తలు ప్రచురించాడని…. దీనిని బట్టి రాధాకృష్ణ ఎంతకు బరితెగించగలడో, ఎంత తెలివి తక్కువ వాడో అర్థమౌతోందన్నారు.
ఎందుకంటే రాధాకృష్ణ పంపితే ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్ చేసి రిజల్ట్ చెప్పదని… ప్రభుత్వం పంపితేనే ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ క్యాసెట్ ను టెస్ట్ చేస్తుందని…. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా రాధాకృష్ణ నీచంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు విజయసాయి రెడ్డి.
వైజాగ్‌లో ఓ ఇంటి యజమాని, అద్దెకు ఉన్న వ్యక్తికి మధ్య గొడవ జరిగితే….. దానిని రాధాకృష్ణ మార్చి రాసి అద్దెకు ఉన్న వాళ్ళు వైసీపీకి ఓటేయమన్నందుకు వైసీపీ కార్యకర్తలు వాళ్ళను కొట్టారని వార్తలు రాస్తున్నాడని….. అది ఇంటి యజమానికి, అద్దెకు ఉండే వాళ్ళకు మధ్య గొడవ అని మా పార్టీకి సంబంధం లేదని పార్టీ నాయకులు చెప్పినా, ఇందులో వైసీపీ ప్రమేయం లేదని పోలీసులు కూడా ఖండించినా ఇప్పటికీ కూడా వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో రాధాకృష్ణ అనే వ్యక్తి చిన్న రిపోర్టర్ అని, పాత స్కూటర్ మీద తిరిగే వాడని, చీకటి పనులు చేసి, అడ్డంగా డబ్బు సంపాదించిన రాధాకృష్ణ… ఇప్పుడు ఒక పేపర్‌ను, ఒక టీవీ ఛానల్ ను నడుపుతున్నాడని… దాదాపు 50 వేల కోట్లకు అధిపతి అయ్యాడని చెప్పారు. ఈ వ్యవహారంలో కూడా చాలా మందిని మోసం చేశాడని, ఆ విషయాలను త్వరలో బయటపెడుతామని చెప్పారు.
రాధాకృష్ణ-చంద్రబాబుల సంభాషణ వీడియో ఒకటి బయటకు వచ్చిందని… అది చూస్తే అందులో చంద్రబాబు-రాధాకృష్ణల సంబంధం బయటపడుతుందని అన్నారు.
అందులో ఇద్దరూ కలిసి ప్రభుత్వ పథకాలకు ఎన్టీఆర్ పేరును తీసేయాలని ప్లాన్ చేశారని, ఆ సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్‌ను వాడు అని సంభోదించాడని…. సొంతమామను ఎవరైనా ”వాడు” అని సంభోదిస్తారా? అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ చంద్రబాబును ఇష్టపడరన్నారు.
బురద కుంటలో ఉండాల్సిన వ్యక్తి మీడియా సంస్థకు అధిపతి అయితే ఎలా ఉంటుందో…. ఒక దుర్మార్గుడిని సీఎం చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుందన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు, జర్నలిజంలో రాధాకృష్ణ నీచులు, దుర్మార్గులు, చీడపురుగులన్నారు. రాధాకృష్ణ మీద ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
పవన్, చంద్రబాబుల మధ్య అంతర్గతంగా లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. అందుకే చంద్రబాబు పవన్ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరంలో ప్రచారం చేయడని, అలాగే పవన్ కళ్యాణ్ కుప్పం, మంగళగిరిలో ప్రచారం చేయడం లేదని చెప్పారు. చంద్రబాబు గుణం అర్ధం చేసుకుని ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ఆయన ఏపీ ప్రజలను కోరారు.