మంత్రులు.... గెలిపిస్తే ఉంటారు.... లేకపోతే ఇంటికే...!
తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలలో టార్గెట్ ను ఫిక్స్ చేస్తూ మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంటూ సూచన లాంటి హెచ్చరికలు చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేస్తున్న 16 స్థానాలను గెలిచి తీరాల్సిందేనని షరతులు విధించారు. ఏ మంత్రికి ఎక్కడ బాధ్యతలు అప్పగించారో అక్కడ విజయం దక్కకపోతే ఆ మంత్రిదే బాధ్యత అని హెచ్చరించారు. అంతేకాదు… ఏ నియోజక […]
తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలలో టార్గెట్ ను ఫిక్స్ చేస్తూ మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంటూ సూచన లాంటి హెచ్చరికలు చేశారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేస్తున్న 16 స్థానాలను గెలిచి తీరాల్సిందేనని షరతులు విధించారు. ఏ మంత్రికి ఎక్కడ బాధ్యతలు అప్పగించారో అక్కడ విజయం దక్కకపోతే ఆ మంత్రిదే బాధ్యత అని హెచ్చరించారు.
అంతేకాదు… ఏ నియోజక వర్గంలో విజయం సాధించలేదో ఆ మంత్రి కి ఉద్వాసన పలుకుతానని పార్టీ సీనియర్ల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు సీనియర్లను కాదని ఇటీవల గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
దీంతో పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. హరీష్ రావు వంటి సీనియర్ నాయకుడి కి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఇది కూడా తీవ్ర విమర్శలకు కారణమైంది.
మంత్రివర్గం పై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు…. మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లోక్ సభ ఎన్నికలను వేదికగా చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఎన్నికలలో 16 నియోజకవర్గాలను గెలుచుకోవాలని ముఖ్యమంత్రి పార్టీ సీనియర్లకు ముఖ్యంగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే వారికి టార్గెట్ ఫిక్స్ చేశారు.
అయితే పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవని అంటున్నారు. గెలుపోటముల బాధ్యతలు మంత్రులపై ఉంచి ఎక్కడ ఎవరు విజయం సాధించకపోయినా మంత్రులను బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు.
ఇందులో భాగంగానే లోక్ సభ ఎన్నికలలో విజయం సాధించని చోట్ల మంత్రులను బాధ్యులను చేసి వారిని క్యాబినెట్ నుంచి తప్పిస్తానని కేసీఆర్ హెచ్చరించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.