"మజిలీ" సినిమా రివ్యూ

రివ్యూ: మజిలీ రేటింగ్‌:  2.75/5 తారాగణం: నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌషిక్ తదితరులు సంగీతం: గోపీ సుందర్, ఎస్.ఎస్.తమన్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్) నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది దర్శకత్వం: శివ నిర్వాణ ఏ మాయ చేసావే, మనం, ఆటో నగర్ సూర్య వంటి సినిమాల్లో కలిసి నటించిన నాగ చైతన్య, సమంత జంట ఈ సారి మజిలీ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వారు ఇద్దరూ కలిసి నటించడం…. పెళ్లి తర్వాత ఇదే […]

Advertisement
Update:2019-04-05 11:09 IST

రివ్యూ: మజిలీ
రేటింగ్‌: 2.75/5
తారాగణం: నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌషిక్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్, ఎస్.ఎస్.తమన్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్)
నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది
దర్శకత్వం: శివ నిర్వాణ

ఏ మాయ చేసావే, మనం, ఆటో నగర్ సూర్య వంటి సినిమాల్లో కలిసి నటించిన నాగ చైతన్య, సమంత జంట ఈ సారి మజిలీ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వారు ఇద్దరూ కలిసి నటించడం…. పెళ్లి తర్వాత ఇదే మొదటి సారి.

ఇంతకు ముందు నిన్ను కోరి అనే చిత్రాన్ని తీసిన శివ నిర్వాణ ఈ సినిమా కి దర్శకుడు. కృష్ణార్జున యుద్ధం తీసిన సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమా ని సంయుక్తంగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన నిర్మించారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందజేయగా, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

ఈ చిత్రం యొక్క ప్రచార చిత్రాలు ఇప్పటికే అందరినీ అలరించి, సినిమా పై ఒక పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేశాయి.

కథ:

పూర్ణ (నాగ చైతన్య) వైజాగ్ లో ఒక క్రికెటర్. ఎప్పటికైనా భారత జట్టు కి ఆడాలనేది తన కోరిక. ఆ దశ లో ఒక రోజు అన్షు (దివ్యాన్ష కౌషిక్ ) ని కలుస్తాడు. మెల్లగా వారి పరిచయం స్నేహం, ఆ పై ప్రేమ వరకు వెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న అన్షు తండ్రి వీరిని వేరు చేసే ప్రయత్నాలు చేసి చివరికి ఇద్దరినీ విడదీస్తాడు.

అన్షు ఫ్యామిలీ తో పాటు వేరే ఊరికి వెళ్ళిపోతారు. కొన్ని రోజులకి పూర్ణ కి శ్రావణి (సమంత) తో వివాహం జరుగుతుంది. లవ్ ఫెయిల్ తర్వాత వివాహం చేసుకున్న పూర్ణ జీవితం సవ్యం గా సాగదు. తన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? తను ప్రేమ వైఫల్యం నుండి ఎలా బయట పడ్డాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు:

ఈ చిత్రానికి షో స్టీలర్ నాగ చైతన్య అని చెప్పచ్చు. చైతన్య నటన పరంగా అద్భుతం గా పరిణితి చెందాడు. డ్రామా సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో తన నటనా ప్రతిభ బాగుంది. మజిలీ నాగ చైతన్య కెరీర్ కి ఒక నూతన మజిలీ అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా లో మనం నాగ చైతన్య లోని ఒక కొత్త నటుడిని చూస్తాము. ఈ సినిమా ని తన నటన తో ముందుండి నడిపించాడు చైతన్య. ఇక సమంత సినిమా కి ప్రధాన ఆకర్షణ. సినిమా లో సరిగ్గా ఇంటర్వెల్ సమయానికి వచ్చే సమంత సెకండ్ హాఫ్ మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంది. శ్రావణి అనే పాత్ర ని చక్కగా పోషించి చైతన్య కి మంచి సహకారం అందించింది.

ఈ సినిమా తో తెరంగేట్రం చేసిన దివ్యాన్ష చక్కటి నటన ని కనబరిచింది. ఒక వైపు అందం, మరో వైపు నటనని సమ పాళ్ళలో పోషించింది.

ఇక రావు రమేష్, పోసాని, సుహాస్, సుదర్శన్, రవిప్రకాష్, అతుల్ కులకర్ణి తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమా కి నిర్మాతలు చక్కటి నిర్మాణ సహాకారం అందించారు. దర్శకుడికి కావాల్సిన విధంగా అన్ని సమకూర్చి సినిమా ఔట్ పుట్ చక్కగా రావడానికి తోడ్పడ్డారు. ఈ సినిమా క్వాలిటీ బాగుంది. అన్ని పాటలు బాగా కుదిరాయి. ప్రతి పాట అద్భుతంగా వచ్చింది. వాటిని అంతే అద్భుతంగా దర్శకుడు స్క్రీన్ పై మలిచాడు.

గోపి సుందర్ సంగీతం, థమన్ నేపథ్య సంగీతం సినిమా కి మరో అసెట్ అని చెప్పచ్చు. విష్ణు శర్మ కెమెరా ని హాండిల్ చేసిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అన్ని లొకేషన్లను అందంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ అందంగా కుదిరింది. ప్రవీణ్ పూడి కూర్పు బాగుంది.

సినిమా ఎలా ఉంది అంటే?

ఖచ్చితంగా ఈ సినిమా కి కథ ప్రధాన ఆకర్షణ. కథ లో కొత్తదనం ఉంది. ఆ కథ ని స్క్రీన్ మీద మలిచిన తీరు కూడా బాగుంది. ఈ కథ అందరి మనసులను తప్పకుండా హత్తుకుంటుంది.

దర్శకుడు శివ నిర్వాణ స్క్రిప్ట్ మీద మంచి శ్రద్ధ పెట్టాడు. ఎమోషనల్ సీన్స్ ని అద్భుతంగా రాసుకున్నాడు. సినిమా కి ఆరంభం, ఇంటర్వెల్ పాయింట్, ముగింపు చక్కగా కుదిరాయి అని చెప్పుకోవచ్చు.

నాగ చైతన్య, దివ్యాన్ష కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. సినిమా లో మొదటి భాగం మనోరంజకంగా, సహజం గా సాగింది. కానీ రెండో భాగం ఎమోషనల్ గా సాగింది.

నాగ చైతన్య మరియు సమంత ఇద్దరూ మంచి నటనని కనబరిచి ప్రేక్షకులని ఆధ్యంతం అలరించారు. కుటుంబ కథా చిత్రం గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ ని దర్శకుడు చక్కగా హ్యాండీల్ చేశాడు.

చివరగా….

‘మజిలీ’ చక్కటి కుటుంబ కథా చిత్రం.

Tags:    
Advertisement

Similar News