పవన్ కు రెండు చోట్లా ఓటమి తప్పదా...!?

ఆయన మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో. తెలుగు రాష్ట్రాలలో అభిమానులను సంపాదించుకున్న హీరో. రాజకీయ పార్టీతో తెలుగు ప్రజల అందరి మన్ననలు పొందాలనుకుంటున్న హీరో.. ఆయనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాలపై మక్కువతో జనసేన పార్టీని ప్రారంభించారు పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న శాసన సభ, లోక్ సభ స్దానాలలో జనసేన అభ్యర్దులను ఎన్నికల బరిలో దించారు. ఆయన కూడా స్వయంగా శాసన సభకు రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. […]

Advertisement
Update:2019-03-31 03:08 IST

ఆయన మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో. తెలుగు రాష్ట్రాలలో అభిమానులను సంపాదించుకున్న హీరో. రాజకీయ పార్టీతో తెలుగు ప్రజల అందరి మన్ననలు పొందాలనుకుంటున్న హీరో.. ఆయనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాలపై మక్కువతో జనసేన పార్టీని ప్రారంభించారు పవన్ కల్యాణ్.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న శాసన సభ, లోక్ సభ స్దానాలలో జనసేన అభ్యర్దులను ఎన్నికల బరిలో దించారు. ఆయన కూడా స్వయంగా శాసన సభకు రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న నియోజక వర్గాలలో ఒకటి ఆయన స్వగ్రామానికి అతి సమీపంలో ఉన్న భీమవరం నియోజకవర్గం. మరొకటి విశాఖపట్నం జిల్లాలోని గాజువాక.

ఈ రెండు నియోజక వర్గాలలో తన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారని, అక్కడ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ రెండు నియోజక వర్గాలలోనూ పవన్ కల్యాణ్ విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీనికి కారణం ఏ నియోక వర్గానికి ఆ నియోజక వర్గ ఓటర్లు… గెలిచాక పవన్ కల్యాణ్ ఆ నియోజక వర్గాన్ని వదులుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

భీమవరం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ కు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక్కడ ప్రముఖ హీరో ప్రభాస్ అభిమానులు విశేషంగా ఉన్నారు. వారంతా పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. దీనికి కారణం వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నారనే ప్రచారం జరగడమే.

ఇక మరో కారణం పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా కంటే విశాఖ జిల్లా పైనే ఎక్కువ మక్కువ చూపుతారని, దీంతో భీమవరం నియోజక వర్గాన్ని వదులుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఎలాగో వదులుకునే స్థానం నుంచి పవన్ కల్యాణ్ కు ఓటు వేయడం వృధా అవుతుందని భీమవరం ఓటర్లు భావిస్తున్నారు.

ఇక పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న రెండో నియోజక వర్గం గాజువాకలో కూడా పవన్ కు అనుకూల పరిస్దితులు లేవంటున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్న స్థానికులు పవన్ కల్యాణ్ తమ వాడు కాదని తన స్వగ్రామనికి దగ్గరలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గాన్ని ఆయన వదులుకోరని ప్రచారం జరుగుతోంది.

దీంతో గాజువాక ఓటర్లు పవన్ కల్యాణ్ ను గెలిపించడం కంటే స్థానికులకు అవకాశం ఇవ్వడమే మేలు అని చెబుతున్నారు. ఈ సమీకరణాలతో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న రెండు నియోజక వర్గాల నుంచి ఆయనకు ఎదురీత తప్పడం లేదని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News