డీజీపీ పై వైసీపీ సంచలన ఆరోపణ
వివాదాస్పద అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిందేనని వైసీపీ పోరాటం చేస్తోంది. మరోసారి వైసీపీ నేతల బృందం ఈసీ ఫుల్ బెంచ్‌ను కలిసి ఏపీలో పరిస్థితులను వివరించింది. ఏపీలో చంద్రబాబు రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీ డీజీపీ స్వయంగా 35 కోట్ల రూపాయలను అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకు తరలించారని విజయసాయిరెడ్డి ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో నిజం లేకుంటే తమపై డీజీపీ కేసు పెట్టాలని సవాల్ చేశారు. డీజీపీ కాన్వాయ్‌ని ఆపే ధైర్యం ఎవరికీ ఉండదు కాబట్టి స్వయంగా డీజీపీ కారులోనే […]
వివాదాస్పద అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిందేనని వైసీపీ పోరాటం చేస్తోంది. మరోసారి వైసీపీ నేతల బృందం ఈసీ ఫుల్ బెంచ్‌ను కలిసి ఏపీలో పరిస్థితులను వివరించింది. ఏపీలో చంద్రబాబు రాజ్యాంగ సంక్షోభాన్ని
సృష్టిస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
ఏపీ డీజీపీ స్వయంగా 35 కోట్ల రూపాయలను అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకు తరలించారని విజయసాయిరెడ్డి ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో నిజం లేకుంటే తమపై డీజీపీ కేసు పెట్టాలని సవాల్ చేశారు. డీజీపీ కాన్వాయ్‌ని ఆపే ధైర్యం ఎవరికీ ఉండదు కాబట్టి స్వయంగా డీజీపీ కారులోనే 35 కోట్లు తరలించారన్నారు. కాబట్టి డీజీపీని తప్పించాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చెప్పారు.
ప్రజాశాంతి పార్టీ వైసీపీ అభ్యర్థుల పేర్లు ఉన్న వారిని తెచ్చి నామినేషన్ వేయించిన 35 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాల జాబితాను ఈసీకి వైసీపీ అందజేసింది.
ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తును రద్దు చేయాలని ఈసీని కోరినట్టు చెప్పారు. తాము పలువురు అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేశామని… కానీ ఈసీ కేవలం ముగ్గురిపై మాత్రమే చర్యలు తీసుకుందన్నారు విజయసాయిరెడ్డి.