“కారు” కు ఉద్యోగులు దూరమవుతున్నారా?

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఊహించని విజయం… రానున్న లోక్ సభ ఎన్నికలలో విజయం ఖాయం. ఒక విజయం… మరొక ఆశకు మధ్య ఊహించని పరిణామం. అదే తెలంగాణ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి దారుణంగా దక్కిన పరాజయం.  ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తమ పార్టీకి చెందిన వారు కాదని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పైకి చెబుతున్నా…. వాస్తవం మాత్రం ప్రజలకు తెలుసునని ప్రతి పక్షాలు అంటున్నాయి. తెలంగాణలో రెండోసారి […]

Advertisement
Update:2019-03-28 02:20 IST

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఊహించని విజయం… రానున్న లోక్ సభ ఎన్నికలలో విజయం ఖాయం. ఒక విజయం… మరొక ఆశకు మధ్య ఊహించని పరిణామం. అదే తెలంగాణ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి దారుణంగా దక్కిన పరాజయం.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తమ పార్టీకి చెందిన వారు కాదని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పైకి చెబుతున్నా…. వాస్తవం మాత్రం ప్రజలకు తెలుసునని ప్రతి పక్షాలు అంటున్నాయి. తెలంగాణలో రెండోసారి ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే అయింది. ఈ మూడు నెలల కాలంలో పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగాయి.

ఆ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో విజయం సాధించిన అభ్యర్థులను తమ పార్టీకి చెందిన వారిగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారు మాత్రం తమ పార్టీకి సంబంధించిన వారు కాదంటూ ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర సమితి నైతికంగా ఓటమిని అంగీకరించినట్లేనని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అంటున్నాయి.

పార్టీ రహితంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమి పాలైన సంగతిని పక్కనబెడితే… రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కు ఉద్యోగులు దూరం అవుతున్నారనడానికి సంకేతం అని విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణలో జరిగినవి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ఉపాధ్యాయులందరూ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లుగా ఈ ఎన్నికలు చూపిస్తున్నాయని చెబుతున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగ వర్గాలు… ముఖ్యంగా ఉపాధ్యాయులు ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన 20 రోజుల్లోగా ఎన్నికలు జరుగుతుండడంతో దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందా అని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం ఆందోళన చెందుతున్నట్లుగా తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వం లోనూ జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసి క్షణక్షణం తనకు నివేదిక అందించాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటు పార్టీ నాయకులను, అటు ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు.

మూడు స్థానాలకే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా…. ఈ ప్రభావం మాత్రం రానున్న లోక్ సభ ఎన్నికలపై పడకుండా చూడాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Tags:    
Advertisement

Similar News