ఉగాది నుంచి గద్దర్‌ సినిమా అవార్డులు

సినిమా నిర్మాణానికి హైదరాబాద్‌ ను గమ్యస్థానంగా మార్చుతాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

Advertisement
Update:2025-01-18 19:03 IST

ఈ ఏడాది ఉగాది నుంచే గద్దర్‌ సినిమా అవార్డులు అందజేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. శనివారం సెక్రటేరియట్‌లో గద్దర్‌ అవార్డుల కమిటీతో ఆయన సమావేశమయ్యారు. తెలుగులో నిర్మించిన ఉత్తమ సినిమాలను గుర్తించి అవార్డులు అందజేస్తామన్నారు. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంచే సినిమాలు, సాంస్కృతిక, విద్య, సామాజిక ఔచిత్యం కలిగిన సినిమాలు, అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన సినిమాలను ప్రోత్సహించేందుకే గద్దర్‌ అవార్డులు అందజేయాలని నిర్ణయించామన్నారు. కల్చరల్‌ ఐకాన్‌ గద్దర్‌ ప్రతిష్టను పెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలన్నారు. సినిమా నిర్మాణానికి హైదరాబాద్‌ ను గమ్యస్థానంగా మార్చుతామన్నారు. సమావేశంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు, ఎండీ డాక్టర్‌ హరీశ్‌, ఈడీ కిషోర్‌బాబు, కమిటీ చైర్మన్‌ నర్సింగ్‌రావు, సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ, హరీశ్‌ శంకర్‌, వందేమాతరం శ్రీనివాస్‌, గుమ్మడి వెన్నెల, అల్లాణి శ్రీధర్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News