నారా పుత్రరత్నం పై ఇంత ప్రేమా పవనూ...!

“ముఖ్యమంత్రి కుమారుడే ముఖ్యమంత్రి కావాలా! ముఖ్యమంత్రి పీఠం అంటే రాజకీయ వారసత్వమా” “ఓ కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా!. ఓ పోస్టుమాన్, ఓ కండక్టర్, మరో ఉపాధ్యాయుడి కొడుకు ముఖ్యమంత్రి పీఠానికి అర్హులు కాదా”…. ఈ మాటలు ఎవరన్నారో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును… ఆయనే జనసేనాని పవన్ కళ్యాణ్ అన్న మాటలే ఇవి. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని ఓ సినీ కవి అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆడవారి మాటలే కాదు […]

Advertisement
Update:2019-03-26 04:25 IST

“ముఖ్యమంత్రి కుమారుడే ముఖ్యమంత్రి కావాలా! ముఖ్యమంత్రి పీఠం అంటే రాజకీయ వారసత్వమా”

“ఓ కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా!. ఓ పోస్టుమాన్, ఓ కండక్టర్, మరో ఉపాధ్యాయుడి కొడుకు ముఖ్యమంత్రి పీఠానికి అర్హులు కాదా”….

ఈ మాటలు ఎవరన్నారో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును… ఆయనే జనసేనాని పవన్ కళ్యాణ్ అన్న మాటలే ఇవి. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని ఓ సినీ కవి అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆడవారి మాటలే కాదు రాజకీయ నాయకుల మాటలకు కూడా అర్ధాలు వేరని తన చర్యల ద్వారా నిరూపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన వారసుణ్ణి కూర్చోబెట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న విశ్వ ప్రయత్నాలకు ఉడతా భక్తి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ కూడా అతని భక్తిని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అళ్ల రామకృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు.

ఇక పొత్తులో భాగంగా జనసేన ఆ స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. ఇక్కడి నుంచి సిపీఐ అభ్యర్ధిగా ముప్పాళ్ల నాగేశ్వరరావు పోటీకి సిద్ధమయ్యారు. ఈ ముగ్గురి మధ్య పోటీలో నారా లోకేష్ పరాజయం పాలు కాక తప్పదని సర్వేలు చెబుతున్నాయి.

ముఖ్యమంత్రి కావాల్సిన కుమారరత్నం ఆదిలోనే ఓడిపోతే అవమానమని భావించిన చంద్రబాబు నాయుడు పావులు కదపడం ప్రారంభించారని చెబుతున్నారు. అందులో భాగంగానే తన రహస్య “అజ్ఞాతవాసి” మిత్రుడు పవన్ కళ్యాణ్ తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారట.

“మంగళగిరిలో పొత్తూ గిత్తూ జాంతానై. జనసేన అభ్యర్థిని రంగంలోకి దింపాల్సిందే. అక్కడ ఓట్లు చీల్చి చినబాబుని గెలిపించాల్సిన బాధ్యత మీదే” అని పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హుకుం లాంటి విజ్ఞాపన చేసినట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.

దీంతో జనసేన అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఆ పార్టీ తరఫున అక్కడి నుంచి చల్లా శ్రీనివాసుని పోటీకి దింపాలని నిర్ణయించారట పవన్ కళ్యాణ్. ఇదేమి పొత్తు ధర్మం అంటూ కమ్యూనిస్టులు గొంతు చించుకున్నా “చినబాబు గెలుపు ముందు పొత్తు ఎంత” అని పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుపోతున్నారని అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు జనసేన నాయకులు లోలోపల కుమిలిపోతున్నారు.

Tags:    
Advertisement

Similar News