బాబుకు రాజయోగమట... పచ్చమీడియా కొత్త ప్రచారం

పథకాల ప్రచారం పారటం లేదు. పసుపు – కుంకుమ పనిచేయడం లేదు. నిరుద్యోగ భృతి అక్కరకు రావటం లేదు. అన్నదాత సుఖీభవ అక్కున చేర్చుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఇది. రానున్న శాసన సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఎటువైపు నుంచి చూసినా అనుకూల పవనాలు వీచటం లేదు. ఆ పార్టీ చేయించుకున్న సొంత సర్వేలలో కూడా తీవ్ర వ్యతిరేకతే వ్యక్తం అవుతోంది. ఇక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న ఎన్నికల సభలలో […]

Advertisement
Update:2019-03-26 05:04 IST

పథకాల ప్రచారం పారటం లేదు. పసుపు – కుంకుమ పనిచేయడం లేదు. నిరుద్యోగ భృతి అక్కరకు రావటం లేదు. అన్నదాత సుఖీభవ అక్కున చేర్చుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఇది.

రానున్న శాసన సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఎటువైపు నుంచి చూసినా అనుకూల పవనాలు వీచటం లేదు. ఆ పార్టీ చేయించుకున్న సొంత సర్వేలలో కూడా తీవ్ర వ్యతిరేకతే వ్యక్తం అవుతోంది. ఇక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న ఎన్నికల సభలలో అయితే కనీస ఉత్తేజం కూడా కానరావటం లేదు.

ఇంతటి వ్యతిరేకత నుంచి తాము బయట పడేందుకు, ప్రజలను ఏమార్చేందుకు అధికార తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీని భుజాన ఎత్తుకుని మోస్తున్న పచ్చ మీడియాకు ఎలాంటి దారీ కనిపించటం లేదు. పరాజయానికి నాలుగు రోడ్ల కూడాలిలో నుంచున్న తెలుగుదేశం పార్టీకి, పచ్చమీడియాకు ఇక జ్యోతిషమే దిక్కు, తోడైంది.

ఎన్నికల తీరు తెన్నులను, ప్రజల మనోగతాలను నిశితంగా పరిశీలిస్తున్న తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం తమను గట్టెకించేది గ్రహాలు, గతులేనని నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీకి అధికారం, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజయోగం పడుతుందంటూ పచ్చ మీడియా కొత్త కథనాలను ప్రచురిస్తోంది.

ఈ కథనాలు వాస్తవం అని ప్రజలు విశ్వసించేందుకు తొలి రోజులలో ఇబ్బందులు ఎదురైనా అంతిమంగా చంద్రబాబుదే విజయం అంటూ కథనంలో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడికి శని విదశతో ఉన్నారని ఆయన గెలుపునకు చివిరి వరకూ అనుమానాలు ఉంటాయని కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ పరిస్ధితి మారి గురు బలంతో చివరకు మంచి ఫలితాలు వస్తాయని కథనంలో పేర్కొన్నారు.

ఈ కథనం చంద్రబాబుకు పూర్తి అనుకూలంగా రాసిందేనని చదివిన వారికి ఇట్టే అర్దం అవుతుందని అంటున్నారు. దానికి కారణం చంద్రబాబులాగే…. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కూడా శని విదశలోనే ఉందని అయితే బాబుకు అనుకూలించే ఈ విదశ పవన్ కల్యాణ్ కు మాత్రం సహకరించదని కథనంలో పేర్కొన్నారు. ఈ అంచనాలే బాబుకు రాజయోగం కథనం పుక్కిట పురాణమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇదంతా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు డీలా పడకుండా ఉండేందుకు పచ్చ మీడియా సృష్టి అని ప్రజలు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News