వర్మ సాధించాడు.... ఈసీ లైన్ క్లియర్
లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ప్రధాన అడ్డంకి తొలిగింది. ఈ సినిమా విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘం ఎదుట ఆ మూవీ నిర్మాత రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల సంఘం తెలిపిన అన్ని అభ్యంతరాలకు సమాధానం ఇచ్చారు. రాకేష్ రెడ్డి వివరణతో ఏకీభవించిన ఎన్నికల సంఘం, సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది. అయితే ఈ సినిమా ఎవరి మనోభావాలను కించపరిచేలా తీయలేదంటూ సర్టిఫికేట్ ఇవ్వాలని, సినిమా ప్రసారం ప్రారంభంలో కూడా చూపించాలని సూచించింది. దీనికి రాకేష్ రెడ్డి అంగీకరించారు. […]
లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ప్రధాన అడ్డంకి తొలిగింది. ఈ సినిమా విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘం ఎదుట ఆ మూవీ నిర్మాత రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల సంఘం తెలిపిన అన్ని అభ్యంతరాలకు సమాధానం ఇచ్చారు.
రాకేష్ రెడ్డి వివరణతో ఏకీభవించిన ఎన్నికల సంఘం, సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది. అయితే ఈ సినిమా ఎవరి మనోభావాలను కించపరిచేలా తీయలేదంటూ సర్టిఫికేట్ ఇవ్వాలని, సినిమా ప్రసారం ప్రారంభంలో కూడా చూపించాలని సూచించింది.
దీనికి రాకేష్ రెడ్డి అంగీకరించారు. ఒకవేళ విడుదల తర్వాత ఏమైనా సమస్యలు వచ్చి అశాంతి నెలకొంటే మరోసారి సమీక్షించడానికి కూడా ఆయన అంగీకరించారు.
ఎలక్షన్ కమిషన్ అంగీకరించడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు అతిపెద్ద అడ్డంకి తొలిగిపోయింది. ఇప్పుడు బంతి సెన్సార్ కోర్టులోకి వెళ్లింది. సెన్సార్ అధికారులు ఈ సినిమా చూసి సర్టిఫికేట్ ఇవ్వాలి. మరోవైపు విడుదలకు ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 3 రోజుల్లో సెన్సార్ పూర్తయినా సినిమా విడుదలవ్వడం కాస్త కష్టమైన వ్యవహారమే. చూస్తుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు వర్మ మాత్రం తన సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఈనెల 29కే విడుదల చేసి తీరతానంటున్నాడు. ఓవైపు ఛానెళ్లన్నీ చుట్టేస్తున్న ఈ దర్శకుడు అస్సలు వెనక్కి తగ్గట్లేదు. సెన్సార్ అధికారులు మాత్రం ఈ సినిమాకు ఇప్పట్లో క్లియరెన్స్ ఇచ్చేలా లేరు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనుకున్న టైమ్ కు విడుదలవుతుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది మరో 24 గంటల్లో తేలిపోతుంది. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఉదంతాన్ని లక్ష్మీపార్వతి యాంగిల్ లో ఈ సినిమాలో చూపించారు.