ఆ విషయం మీకూ తెలుసు పవన్‌ " కేటీఆర్‌

తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారనడం… తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్థాన్‌తో పోల్చడం, అక్కడ పరిస్థితులు బాగోలేవంటూ ఎన్నికల ప్రచార సభల్లో పవన్‌ కల్యాణ్ రెచ్చగొడుతూ చేసిన ప్రసంగంపై కేటీఆర్‌ స్పందించారు. పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలను సున్నితంగా తిప్పికొట్టారు. రాష్ట్రం ఆవిర్భావం నుంచి 29 రాష్ట్రాలకు చెందిన ప్రజలు తెలంగాణలో కలిసిమెలిసి ఉంటున్నారనే విషయం మీకు కూడా తెలుసని పవన్‌ను ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీ ఆలోచనలకు సరికానివి అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలతో అనవసరంగా వ్యతిరేకతను పెంచుతాయని పవన్‌ కల్యాణ్‌కు కేటీఆర్ […]

Advertisement
Update:2019-03-23 02:51 IST

తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారనడం… తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్థాన్‌తో పోల్చడం, అక్కడ పరిస్థితులు బాగోలేవంటూ ఎన్నికల ప్రచార సభల్లో పవన్‌ కల్యాణ్ రెచ్చగొడుతూ చేసిన ప్రసంగంపై కేటీఆర్‌ స్పందించారు. పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలను సున్నితంగా తిప్పికొట్టారు.

రాష్ట్రం ఆవిర్భావం నుంచి 29 రాష్ట్రాలకు చెందిన ప్రజలు తెలంగాణలో కలిసిమెలిసి ఉంటున్నారనే విషయం మీకు కూడా తెలుసని పవన్‌ను ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీ ఆలోచనలకు సరికానివి అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలతో అనవసరంగా వ్యతిరేకతను పెంచుతాయని పవన్‌ కల్యాణ్‌కు కేటీఆర్ హితవు పలికారు.

పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై జనసేన అభిమానులు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. పవన్‌ కల్యాణ్ అలా వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే టీడీపీ పత్రికలు నిత్యం మొదటి పేజీలోనే పవన్‌ చేసిన విధ్వేషపూరిత ప్రసంగాన్ని బ్యానర్‌గా పెట్టి ప్రచురిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News