టీడీపీ ఎన్నికల ప్రచార ప్రకటనలో అసత్యాలు...

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రసారం చేసే ప్రకటనలపై ఈసీ నియంత్రణ ఉంటుంది. ఈసీ పరిశీలించిన తర్వాత అభ్యంతరకరంగా లేని ప్రకటనలను మాత్రమే అనుమతి ఇస్తుంది. అయితే ఇప్పుడు టీడీపీ ప్రకటన ఒకటి వివాదాస్పదమవుతోంది. ఆ మధ్య చంద్రబాబు ఆవు ఇచ్చారన్న ప్రకటనలో ఆవుకు బదులు ఎద్దును చూపించారంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవకు సంబంధించిన ప్రకటనపై దుమారం రేగుతోంది. అన్నదాత సుఖీభవ ప్రకటనలో రైతు వేషంలో నటించిన వ్యక్తి చేత… ఏకంగా చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం […]

Advertisement
Update: 2019-03-21 07:23 GMT

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రసారం చేసే ప్రకటనలపై ఈసీ నియంత్రణ ఉంటుంది. ఈసీ పరిశీలించిన తర్వాత అభ్యంతరకరంగా లేని ప్రకటనలను మాత్రమే అనుమతి ఇస్తుంది. అయితే ఇప్పుడు టీడీపీ ప్రకటన ఒకటి వివాదాస్పదమవుతోంది.

ఆ మధ్య చంద్రబాబు ఆవు ఇచ్చారన్న ప్రకటనలో ఆవుకు బదులు ఎద్దును చూపించారంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవకు సంబంధించిన ప్రకటనపై దుమారం రేగుతోంది.

అన్నదాత సుఖీభవ ప్రకటనలో రైతు వేషంలో నటించిన వ్యక్తి చేత… ఏకంగా చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం కింద 15వేలు చెల్లించినట్టు చెప్పించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం చెల్లించింది ఒక్కో రైతుకు వెయ్యి రూపాయలు మాత్రమే.

టీడీపీ తన ప్రకటనలో మాత్రం ఏకంగా 15వేలు ఇప్పటికే ఇచ్చేసినట్టు చెప్పించడం ఓటర్లను తప్పుదోవ పట్టించడమేనన్న విమర్శలు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News