అర్జున్ రెడ్డి రీమేక్ లో గౌతమ్ మీనన్

చియాన్ విక్రమ్ తన కుమారుడిని ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేద్దాం అనే ఉద్దేశ్యం తో అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ హక్కులని సంపాదించి తనకి ఎంతో ఇష్టమైన బాలని దర్శకుడిగా పెట్టి సినిమాని ఆరంభించారు. కొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ ముగుస్తుంది అన్న సమయానికి సినిమా ఔట్ పుట్ విషయం లో విభేదాలు రావడంతో ఈ చిత్ర నిర్మాతలు సినిమాని ఆపేసారు. ఇప్పుడు సినిమాని మళ్ళీ ఫ్రెష్ గా మొదటి నుండి తీద్దాం అని ఫిక్స్ అయి…. హీరో […]

Advertisement
Update:2019-03-21 07:36 IST

చియాన్ విక్రమ్ తన కుమారుడిని ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేద్దాం అనే ఉద్దేశ్యం తో అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ హక్కులని సంపాదించి తనకి ఎంతో ఇష్టమైన బాలని దర్శకుడిగా పెట్టి సినిమాని ఆరంభించారు. కొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ ముగుస్తుంది అన్న సమయానికి సినిమా ఔట్ పుట్ విషయం లో విభేదాలు రావడంతో ఈ చిత్ర నిర్మాతలు సినిమాని ఆపేసారు.

ఇప్పుడు సినిమాని మళ్ళీ ఫ్రెష్ గా మొదటి నుండి తీద్దాం అని ఫిక్స్ అయి…. హీరో ని తప్ప అందరినీ మార్చేశారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాని ఆపేసి…. మొత్తం అందరినీ మార్చేయడం ఇదే మొదటిసారి.

అయితే ఈ సారి తెలుగు అర్జున్ రెడ్డి కి దర్శకత్వ శాఖ లో పనిచేసిన గిరీశయ్య ని దర్శకుడి గా పెట్టి సినిమాని తీయనున్నారు నిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ని ఈ సినిమా లో తండ్రి పాత్ర కి తీసుకుందాం అని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అడపా దడపా సినిమాల్లో నటించే గౌతమ్ మీనన్ ఈ పాత్ర కి ఖఛ్చితంగా సెట్ అవుతాడని అంటున్నారు. ‘ఆదిత్య వర్మ’ అనే టైటిల్ ని ఖరారు చేసిన చిత్ర వర్గాలు త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.

Tags:    
Advertisement

Similar News