చంద్రబాబు వల్లే ఆయన కులం ఇతర కులాలకు దూరమైంది....

ఆంధ్రప్రదేశ్‌ను సంస్థానంగా మార్చేశారన్నారు మాజీ కమిషనర్‌ విజయ్‌ బాబు. బ్రిటిష్ కాలం నాటి సంస్థానాలను వెనక్కు తెచ్చి ఏపీని చంద్రబాబు, నారా లోకేష్‌ల ప్రైవేట్ ఎస్టేట్‌గా మార్చేశారన్నారు ఆయన. కుల పిచ్చి, మత పిచ్చి, బంధుప్రీతి ఉన్న పార్టీ టీడీపీ మాత్రమేనని గతంలో లోకేషే చెప్పారన్నారు. తదాస్తు దేవతలే వారి చేత చెప్పిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పనిచేయలేదని స్వయంగా ముఖ్యమంత్రి చెబుతున్న తర్వాత ఇక ఈ పాలనలో విలువలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా ఎన్నికల అంశాలను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు […]

Advertisement
Update:2019-03-20 06:10 IST

ఆంధ్రప్రదేశ్‌ను సంస్థానంగా మార్చేశారన్నారు మాజీ కమిషనర్‌ విజయ్‌ బాబు. బ్రిటిష్ కాలం నాటి సంస్థానాలను వెనక్కు తెచ్చి ఏపీని చంద్రబాబు, నారా లోకేష్‌ల ప్రైవేట్ ఎస్టేట్‌గా మార్చేశారన్నారు ఆయన.

కుల పిచ్చి, మత పిచ్చి, బంధుప్రీతి ఉన్న పార్టీ టీడీపీ మాత్రమేనని గతంలో లోకేషే చెప్పారన్నారు. తదాస్తు దేవతలే వారి చేత చెప్పిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పనిచేయలేదని స్వయంగా ముఖ్యమంత్రి చెబుతున్న తర్వాత ఇక ఈ పాలనలో విలువలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు.

గత కొన్ని రోజులుగా ఎన్నికల అంశాలను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నీరో చక్రవర్తి కంటే చంద్రబాబు పాలన దారుణంగా ఉందన్నారు. ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని విజయ్‌బాబు సూచించారు. ప్రజల మీద కక్ష సాధించే లక్షణం నాయకుడు అనే వాడికే ఉండకూడదన్నారు. కానీ తన వద్దకు వచ్చే ప్రతి వ్యక్తిని వీడు మన కులమేనా?, మనతో ఉంటాడా?, మనపార్టీ వాడేనా? అని స్కాన్‌ చేసి చూసే వ్యక్తి నాయకుడు ఎలా అవుతారని విజయ్‌బాబు ప్రశ్నించారు. సన్ స్ట్రోక్ కొట్టినప్పుడు మైండ్ కూడా పనిచేయదని… ఇప్పుడు చంద్రబాబుది అదే పరిస్థితి అన్నారు.

ఇంత అడ్డగోలు పాలన ఎప్పుడూ లేదన్నారు. చంద్రబాబుకు క్యాస్ట్ మానియా పట్టుకుందన్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ కుల రాజకీయం వల్ల ఆయన సొంత కులంలోని వారు కూడా మిగిలిన కులాలకు దూరమై ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏపీని సామాజికంగానూ నాశనం చేసినా చరిత్ర చంద్రబాబుదేనన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుటుంబ సభ్యులే సీబీఐతో గానీ, థర్డ్ పార్టీతోగానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నప్పుడు … నిజంగా హత్య వెనుక టీడీపీ ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణకు ఆదేశించేందుకు చంద్రబాబుకున్న ఇబ్బంది ఏమిటని విజయబాబు ప్రశ్నించారు.

రాష్ట్రంలో మహిళలు, అమ్మాయిల ఫోన్‌ నెంబర్లు, వారి వ్యక్తిగత వివరాలను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి మించిన దారుణం ఉంటుందా అని విజయ్ బాబు ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News