బాబు వద్దే తేల్చుకుంటానని అమరావతికి సబ్బంహరి
మాజీ ఎంపీ సబ్బం హరి తనకు ఎంపీ టికెట్ కాకుండా ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంపై ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ ఎంపీ టికెట్‌ను సబ్బంహరి ఆశించారు. చంద్రబాబు నుంచి కూడా ఆ మేరకు తొలుత సంకేతాలు వచ్చాయి. అయితే విశాఖ ఎంపీ స్థానాన్ని బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు కేటాయించారు. సబ్బంహరికి భీమిలి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. దాంతో సబ్బంహరి ఆగ్రహించారు. మంత్రి గంటా శ్రీనివాస్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా సబ్బం శాంతించలేదు. ఇలా చేస్తారని తాను ఊహించలేదని రుసరుసలాడారు. ఇలా ఎందుకు జరిగిందో, తాను చంద్రబాబు వద్దే […]
మాజీ ఎంపీ సబ్బం హరి తనకు ఎంపీ టికెట్ కాకుండా ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంపై ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ ఎంపీ టికెట్‌ను సబ్బంహరి ఆశించారు. చంద్రబాబు నుంచి కూడా ఆ మేరకు తొలుత సంకేతాలు వచ్చాయి. అయితే విశాఖ ఎంపీ
స్థానాన్ని బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు కేటాయించారు.
సబ్బంహరికి భీమిలి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. దాంతో సబ్బంహరి ఆగ్రహించారు. మంత్రి గంటా శ్రీనివాస్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా సబ్బం శాంతించలేదు. ఇలా చేస్తారని తాను ఊహించలేదని రుసరుసలాడారు.
ఇలా ఎందుకు జరిగిందో, తాను చంద్రబాబు వద్దే తేల్చుకుంటానని సబ్బంహరి అమరావతికి బయలుదేరి వెళ్లారు. అయితే అంతా అయిపోయిందని… ఇప్పుడు పోటీ చేయడమో, విరమించుకోవడమో తప్ప సబ్బంహరి సాధించేదేమీ లేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.