శ్రీశైలం టీడీపీ అభ్యర్ధిగా... ఏవీ సుబ్బారెడ్డి ?

అసలు యుద్ధం ఇంకా మొద‌లు కాలేదు. ప్ర‌చార ప‌ర్వం నిన్న‌టి నుంచి పీక్ స్టేజీకి చేరింది. వైసీపీ, టీడీపీ అధినేతలు ప్ర‌చార సంగ్రామంలోకి నిన్న‌నే దూకారు. ఇటు ఇవాళ్టి నుంచి నామినేష‌న్ల ప‌ర్వం మొదలైంది. కానీ టీడీపీలో రోజుకో నేత పోటీకి ముందుకు రావ‌డం లేదు. త‌మ ఓట‌మి ఖ‌రారై…. కంగారులో రోజుకొక‌రు పార్టీ మారుతున్నారు. లేదా పోటీకి వెనుకంజ వేస్తున్నారు. మొన్న‌టికి మొన్న నెల్లూరు రూర‌ల్ టీడీపీ టికెట్ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి ద‌క్కింది. కానీ […]

Advertisement
Update:2019-03-18 06:57 IST

అసలు యుద్ధం ఇంకా మొద‌లు కాలేదు. ప్ర‌చార ప‌ర్వం నిన్న‌టి నుంచి పీక్ స్టేజీకి చేరింది. వైసీపీ, టీడీపీ అధినేతలు ప్ర‌చార సంగ్రామంలోకి నిన్న‌నే దూకారు.

ఇటు ఇవాళ్టి నుంచి నామినేష‌న్ల ప‌ర్వం మొదలైంది. కానీ టీడీపీలో రోజుకో నేత పోటీకి ముందుకు రావ‌డం లేదు. త‌మ ఓట‌మి ఖ‌రారై…. కంగారులో రోజుకొక‌రు పార్టీ మారుతున్నారు. లేదా పోటీకి వెనుకంజ వేస్తున్నారు.

మొన్న‌టికి మొన్న నెల్లూరు రూర‌ల్ టీడీపీ టికెట్ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి ద‌క్కింది. కానీ ఆయ‌న టీడీపీలో ఉండేందుకు ఆయన అభిమానులు ఒప్పుకోలేదు. చివ‌ర‌కు ఆయ‌న టైమ్ చూసుకుని టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు. ర‌వీంద్ర‌బాబు, బుట్టా రేణుక‌, దాడి వీర‌భ‌ద్ర‌రావు లాంటి నేత‌లు కూడా టికెట్లు ఆశించకుండా…. వైసీపీలో చేరారు.

ఇప్పుడు తాజాగా క‌ర్నూలు నుంచి అప్‌డేట్ న్యూస్ విన‌బడుతోంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడ‌ని తెలుస్తోంది. ఫోన్ స్విచాప్ చేసిన‌ట్లు స‌మాచారం. టీడీపీ లిస్ట్‌లో ఆయ‌న‌కు టికెట్ ద‌క్కింది. కానీ ఆయ‌న పోటీకి మాత్రం వెనుకంజ వేస్తున్నారు. టీడీపీకి ఎదురుగాలి వీస్తుంద‌నే విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన బుడ్డా పోటీ నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బంధువులు మాత్రం ఈయన పోటీ నుంచి తప్పుకోవడానికి వేరే కారణం చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి భార్య తీవ్ర ఆనారోగ్యంతో (క్యాన్సర్) బాధపడుతోందని…. అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా రాజశేఖర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడానికే అజ్ఞాతంలోకి వెళ్ళాడని అంటున్నారు.

బుడ్డా సైలెంట్ అయిన విష‌యం ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు వెంట‌నే ఏవీ సుబ్బారెడ్డిని పిలిపించుకున్నాడు. సుబ్బారెడ్డికి ఈ శ్రీశైలం నియోజకవర్గంలోని మహానంది మండలంలో బంధు వర్గం ఉంది. ఆ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఏవీ సుబ్బారెడ్డిని శ్రీశైలం నుంచి పోటీ చేయమని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

మొత్తానికి నామినేష‌న్ల ప‌ర్వం ముగిసేలోపు ఏపీ రాజకీయాల్లో వింత కథలు క‌నిపిస్తాయ‌ని తెలుస్తోంది. ‘బీ ఫామ్‌’ తీసుకున్న తర్వాత కూడా కొంద‌రు నేత‌లు అస్త్ర శస్త్రాలు విడవబోతున్నారా? అనే భ‌యం టీడీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News