పవన్ కు కేసీఆర్ "మాయ" చెక్!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి పన్నుతున్న వ్యూహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెక్ పెట్టినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్…. పైకి శత్రువులుగా నటిస్తూ లోలోపల మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనుకుంటున్న వారిద్దరికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తనదైన శైలిలో చెక్ పెడుతున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఈ ఇద్దరు నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్న […]

Advertisement
Update:2019-03-18 02:20 IST

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి పన్నుతున్న వ్యూహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెక్ పెట్టినట్లు సమాచారం.

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్…. పైకి శత్రువులుగా నటిస్తూ లోలోపల మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనుకుంటున్న వారిద్దరికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తనదైన శైలిలో చెక్ పెడుతున్నట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఈ ఇద్దరు నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యుపి వెళ్లి బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతిని సైతం కలుసుకున్నారు పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో దళిత, బీసీ, మైనార్టీ ఓట్లను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి దూరం చేసేందుకు మాయావతితో చెలిమి చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లో మాయావతితో కలిసి కొత్త పొత్తుకు సై అన్నారు. ఈ హఠాత్తు స్నేహం వెనుక దళిత ఓట్లను చీల్చడమే అని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇలా చీల్చడం ద్వారా చంద్రబాబు నాయుడికి మేలు చేసేందుకే మాయావతితో చేతులు కలిపేందుకు పవన్ కల్యాణ్ యుపీ వెళ్లారని కూడా అంటున్నారు.

ఈ సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన పావులు కదిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది…. లోక్ సభకు ఎక్కువ మంది ఎంపీలు తీసుకువచ్చేది వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అని, పవన్ కల్యాణ్ అందిస్తున్న ఈ కొత్త స్నేహం చంద్రబాబు నాయుడికి మేలు చేసేందుకే అని మాయావతికి వివరించినట్లు పార్టీలో అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ కు కనీసం ఒక్క ఎంపీ స్ధానం కూడా రాదని, భవిష్యత్ లో వారి నుంచి మీకు ఎలాంటి మేలు జరుగదని బీఎస్పీ నాయకురాలు మాయావతికి తెలంగాణ ముఖ్యమంత్రి వివరించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకుని స్నేహ హస్తం చాచాడంపై పునరాలోచించాలని సూచించినట్లు చెబుతున్నారు.

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో భారీ విజయం ఖాయమని, అలాంటి వారిని వదిలేసి విజయం సాధించని వారి వెంట పరుగులు తీయడం మంచిది కాదని హితవు పలికినట్లు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో తన దూతను పంపి ఆంధ్రప్రదేశ్ లో వాస్తవ పరిస్థితులను వివరిస్తామని కూడా కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Tags:    
Advertisement

Similar News