మరి కుప్పం సంగతేంటి పవన్?

పవన్ కల్యాణ్‌ తాను తటస్తుడిని అని చాటుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా… ఆయనకు ఎక్కడో చంద్రబాబు అంటే ఇష్టం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ప్రసంగాలు చూస్తే మాట వరుసగా చంద్రబాబును రెండు మాటలు అనేసి… ప్రతిపక్షాన్ని పది మాటలు అనడం ద్వారా ఎవరికి లాభం చేయాలనుకుంటున్నారో… ఎవరికి నష్టం కలిగించాలనుకుంటున్నారో స్పష్టంగానే చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావ సభలోనూ పవన్ ప్రసంగం అదే పంథాలో సాగింది. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ కోసం గంట పాటు ఎదురుచూసి వచ్చిన పవన్ కల్యాణ్… ఇప్పుడు అచ్చం చంద్రబాబు తరహాలోనే […]

Advertisement
Update:2019-03-15 04:07 IST

పవన్ కల్యాణ్‌ తాను తటస్తుడిని అని చాటుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా… ఆయనకు ఎక్కడో చంద్రబాబు అంటే ఇష్టం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ప్రసంగాలు చూస్తే మాట వరుసగా చంద్రబాబును రెండు మాటలు అనేసి… ప్రతిపక్షాన్ని పది మాటలు అనడం ద్వారా ఎవరికి లాభం చేయాలనుకుంటున్నారో… ఎవరికి నష్టం కలిగించాలనుకుంటున్నారో స్పష్టంగానే చెబుతున్నారు.

పార్టీ ఆవిర్భావ సభలోనూ పవన్ ప్రసంగం అదే పంథాలో సాగింది. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ కోసం గంట పాటు ఎదురుచూసి వచ్చిన పవన్ కల్యాణ్… ఇప్పుడు అచ్చం చంద్రబాబు తరహాలోనే కేసీఆర్‌కు జగన్‌కు ఏదో
ఉందని మాట్లాడుతున్నారు.

కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టకూడదని నీతులు చెబుతూనే ఎప్పుడో ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మళ్లీ ఇప్పుడు గుర్తు చేసి ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. టార్గెట్‌ జగన్‌గానే ఆయన ప్రసంగం సాగింది.

బీసీల మీద అంత ప్రేమ ఉంటే కడప ఎంపీ టికెట్ ఇస్తావా జగన్? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కానీ అదే సమయంలో ఆ ప్రశ్న చంద్రబాబుకు మాత్రం వేయలేదు. బీసీలకు బతకడం నేర్పించింది తానేనని చెప్పుకునే చంద్రబాబు అంత ప్రేమ ఉంటే కుప్పం సీటు బీసీలకు ఇస్తావా?, గుంటూరు ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తావా?…. అని మాత్రం పవన్‌ కల్యాణ్ ప్రశ్నించలేదు.

2014 ఎన్నికల్లో కులాల వారీగా హామీలు ఇచ్చి చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేస్తే దాన్ని ఆమోదించిన పవన్‌ కల్యాణ్…
ఇప్పుడు జగన్‌ బీసీ గర్జన సభ పెట్టగానే విమర్శించడం బట్టి పవన్‌ కల్యాణ్ రాజకీయం ఎటు వైపు ఉందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News