చంద్రబాబుకు బాలకృష్ణ అల్టిమేటం....

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఎమ్మెల్యే బాలకృష్ణ అల్టిమేటం జారీ చేశారు. దీంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. సీట్ల విషయంలో మార్పులు చేస్తున్నారు. తన చిన్న అల్లుడు భరత్‌, తన అనుచరుడు కదిరి బాబురావుకు టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబును తొలి నుంచి బాలకృష్ణ కోరుతున్నారు. అయితే బాలకృష్ణ మాటలను లెక్క చేయకుండా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన ఆగ్రహించారు. తన చిన్నల్లుడు భరత్, కదిరి బాబురావుకు టికెట్లు ఇవ్వాల్సిందేనని చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. దీంతో విశాఖ లేదా రాజమండ్రి ఎంపీ స్థానాన్ని భరత్‌కు కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. లోకేష్‌ను […]

Advertisement
Update:2019-03-13 11:36 IST

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఎమ్మెల్యే బాలకృష్ణ అల్టిమేటం జారీ చేశారు. దీంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. సీట్ల విషయంలో మార్పులు చేస్తున్నారు. తన చిన్న అల్లుడు భరత్‌, తన అనుచరుడు కదిరి బాబురావుకు టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబును తొలి నుంచి బాలకృష్ణ కోరుతున్నారు.

అయితే బాలకృష్ణ మాటలను లెక్క చేయకుండా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన ఆగ్రహించారు. తన చిన్నల్లుడు భరత్, కదిరి బాబురావుకు టికెట్లు ఇవ్వాల్సిందేనని చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. దీంతో విశాఖ లేదా రాజమండ్రి ఎంపీ స్థానాన్ని భరత్‌కు కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.

లోకేష్‌ను కూడా తొలుత విశాఖ జిల్లా నుంచే పోటీ చేయించాలనుకున్నారు. కానీ బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్లు ఒకే జిల్లాలో పోటీ చేస్తే బాగోదని భావించిన చంద్రబాబు… లోకేష్‌ను మంగళగిరికి మార్చారు.

కదిరి బాబురావును పిలిచి కనిగిరి టికెట్ కేటాయించారు. ఉగ్రనరసింహారెడ్డికి దర్శి టికెట్ ఇస్తున్నారు. దర్శికి ప్రాతినిధ్యం
వహిస్తున్న శిద్దారాఘవరావును ఒంగోలు ఎంపీగా బరిలో దింపుతున్నారు.

Tags:    
Advertisement

Similar News