గులాబీ ఎంపీ క్యాండేట్లలో మార్పులు.... కారణాలు ఇవేనా ?
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థులు ఎవరు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని హింట్లు ఇచ్చారు. ఈ సారి ఎంపీ అభ్యర్థులను మార్చుతున్నట్లు సంకేతాలు పంపారు. ఒకరా? ఇద్దరా? తెలియదు. కానీ ఎంపీ క్యాండేట్ల మార్పు ఉంటుందని మాత్రం తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని పాత జిల్లాల ప్రకారం తొమ్మిది జిల్లాలో గులాబీ జెండా ఎగిరింది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం […]
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థులు ఎవరు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని హింట్లు ఇచ్చారు. ఈ సారి ఎంపీ అభ్యర్థులను మార్చుతున్నట్లు సంకేతాలు పంపారు. ఒకరా? ఇద్దరా? తెలియదు. కానీ ఎంపీ క్యాండేట్ల మార్పు ఉంటుందని మాత్రం తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని పాత జిల్లాల ప్రకారం తొమ్మిది జిల్లాలో గులాబీ జెండా ఎగిరింది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఒకే ఒక సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, సెంచరీ కొట్టాలని కలలు కన్నా కేసీఆర్‌కు ఖమ్మం ఫలితాలు కంగుతినిపించాయి. ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా గమనించిన కేసీఆర్…. ఇక్కడ గ్రూపు తగాదాలే కొంప ముంచాయనే నిర్ధారణకు వచ్చారు. దీంతో ఇక్కడ బలపడేందుకు పావులు కదిపారు. ఆపరేషన్ ఆదివాసీతో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా లైన్‌లో ఉన్నారు.
అయితే గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడిచేందుకు ప్రయత్నించారని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ డౌట్ అనే ప్రచారం మొదలైంది. మహింద్రా మోటార్స్ షోరూమ్‌ల అధినేత వీవీసీ రాజేంద్రప్రసాద్‌కు టికెట్ ఇస్తున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఖమ్మంలో 16న జరిగే టీఆర్ఎస్ సన్నాహాక సమావేశానికి ఈయన ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే టికెట్ కోసం పొంగులేటి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఖమ్మంతో పాటు పక్కనే ఉన్న మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌కు టికెట్‌పై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ ముగ్గురు నుంచి నలుగురు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో మల్కాజిగిరి టికెట్ ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మల్లారెడ్డి తమ్ముడు రాజశేఖర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అయితే కేసీఆర్ అంతరంగికుడు సంతోష్‌రావు బంధువు అయిన నవీన్ రావుకు టికెట్ దక్కవచ్చని తెలుస్తోంది.
నల్గొండ నుంచి గతంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయనే మళ్లీ పోటీ చేస్తారా? లేదా అనేది తేలాల్సి ఉంది. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డిపై కూడా కేసీఆర్ అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరితే…. అప్పుడు సీనియర్‌గా మంత్రి పదవి రేసులో జితేందర్ రెడ్డి ముందు ఉంటారు. దీంతో ఆయన్ని ఇక్కడే తప్పిస్తారని ఓ టాక్. అంతేకాకుండా కవితతో ఈయన సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని అంటున్నారు.
వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌కు టికెట్ దక్కక పోవచ్చని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక్కడ కడియం లేదా ఆయన కూతురికి టికెట్ ఇస్తారని ఓరుగల్లు గులాబీ నేతలు అంటున్నారు. మరోవైపు చేవెళ్ల టికెట్ రంజిత్ రెడ్డికి ఇస్తారని గులాబీ నేతల మాట. ఆయన ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే సబితా ఇంద్రారెడ్డి పార్టీలోకి రావడం ఖాయం కావడంతో… కార్తీక్‌రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారని తెలుస్తోంది.
మొత్తానికి ఎమ్మెల్యే అభ్యర్థులను స్వల్పంగా మార్చి భారీ విజయం నమోదు చేసిన కేసీఆర్…. ఎంపీ క్యాండేట్లను మాత్రం మార్చేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.