సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కన్హయ్యకుమార్..!

జేఎన్‌యూ స్టుడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి కన్హయ్యకుమార్‌ పోటీ చేస్తున్నట్లు మహాకూటమి ప్రకటించింది. ఆర్జీడీ నేతృత్వంలోని మహాకూటమిలో కాంగ్రెస్, లోక్ సమతా పార్టీ, హిందుస్థానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్), వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ, వామపక్షాలు ఉన్నాయి. ఇక మహాకూటమి తరపున కన్హయ్యకుమార్ అభ్యర్థిత్వాన్ని లాలూప్రసాద్ యాదవ్ ప్రకటించాలని భావించినా.. అంతకు మునుపే […]

Advertisement
Update:2019-03-12 05:37 IST

జేఎన్‌యూ స్టుడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్నారు.

బీహార్‌లోని బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి కన్హయ్యకుమార్‌ పోటీ చేస్తున్నట్లు మహాకూటమి ప్రకటించింది. ఆర్జీడీ నేతృత్వంలోని మహాకూటమిలో కాంగ్రెస్, లోక్ సమతా పార్టీ, హిందుస్థానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్), వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ, వామపక్షాలు ఉన్నాయి.

ఇక మహాకూటమి తరపున కన్హయ్యకుమార్ అభ్యర్థిత్వాన్ని లాలూప్రసాద్ యాదవ్ ప్రకటించాలని భావించినా.. అంతకు మునుపే బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు తేజశ్వి ముందుగానే వెల్లడించారు. అయితే మహాకూటమిలోని సీపీఐ తరపున కన్హయ్య పోటీ చేస్తారని ఆ పార్టీ సీనియర్నేత రామ్ నరేష్ పాండే స్పష్టం చేశారు.

జేఎన్‌యూ విద్యార్థిగా అందరికీ తెలిసిన కన్హయ్య బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా బిగత్ గ్రామంలో జన్మించారు. 2016లో జేఎన్‌యూలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణలపై అతనిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద చార్జిషీటు నమోదు చేసి ఇటీవలే పాటియాలా హౌజ్ కోర్టులో సమర్పించారు.

Tags:    
Advertisement

Similar News