టీడీపీలో చేరనున్న లక్ష్మీనారాయణ..?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆయనకు భీమిలి అసెంబ్లీ సీట్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నుంచి హామీ లభించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ టీడీపీలోనికి రావడానికి మధ్యవర్తిత్వం నడిపినట్లు తెలుస్తోంది. తొలుత సొంత పార్టీ పెడతారని.. ఆ తర్వాత జనసేన, బీజేపీల్లోకి వెళతారని వార్తలు వచ్చాయి. ఒక సారి లోక్‌సత్తాలో చేరడానికి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినా ఇంత వరకు […]

Advertisement
Update:2019-03-12 01:00 IST

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆయనకు భీమిలి అసెంబ్లీ సీట్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నుంచి హామీ లభించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ టీడీపీలోనికి రావడానికి మధ్యవర్తిత్వం నడిపినట్లు తెలుస్తోంది.

తొలుత సొంత పార్టీ పెడతారని.. ఆ తర్వాత జనసేన, బీజేపీల్లోకి వెళతారని వార్తలు వచ్చాయి. ఒక సారి లోక్‌సత్తాలో చేరడానికి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినా ఇంత వరకు ఏ పార్టీలలోనూ చేరలేదు. అయితే టీడీపీకి ఈ ఎన్నికలలో ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీని ఎదుర్కోవడానికి లక్ష్మీనారాయణ అయితే కరెక్ట్ వ్యక్తి అని అధినేత చంద్రబాబు భావించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సోమవారం లక్ష్మీనారాయణతో మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. భీమిలి సీటు ఇచ్చేందుకు అధినేత సుముఖంగా ఉన్నట్లు ఆయనకు చెప్పారు. దీంతో ఆయన టీడీపీలోనికి వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి.. పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక భీమిలీ టికెట్‌ను నారా లోకేష్‌కు ఇవ్వనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే లోకేష్ ప్రస్తుతం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లక్ష్మీనారాయణకు భీమిలి టికెట్ ఇవ్వడానికి అడ్డంకులు లేనట్లే.

Tags:    
Advertisement

Similar News