8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల కోసం బాబు వెతుకులాట...

గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ముఖ్యంగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటోంది. దీంతో చంద్రబాబే సీనియర్లపై ఒత్తిడి తెచ్చి ఎంపీలుగా పోటీ చేయాలని కోరుతున్నారు. కానీ వారు ససేమిరా అంటున్నారు. ఎనిమిది లోక్‌సభ నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నారు. విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, ఓంగోలు స్థానాల్లో అభ్యర్థులు ముందుకు రావడం లేదు. నరసరావుపేట నుంచి కోడెల శివప్రసాద రావును పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నా ఆయన మాత్రం […]

Advertisement
Update:2019-03-12 12:37 IST

గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ముఖ్యంగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటోంది. దీంతో చంద్రబాబే సీనియర్లపై ఒత్తిడి తెచ్చి ఎంపీలుగా పోటీ చేయాలని కోరుతున్నారు. కానీ వారు ససేమిరా అంటున్నారు.

ఎనిమిది లోక్‌సభ నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నారు. విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, ఓంగోలు స్థానాల్లో అభ్యర్థులు ముందుకు రావడం లేదు.

నరసరావుపేట నుంచి కోడెల శివప్రసాద రావును పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నా ఆయన మాత్రం సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటున్నారు. విశాఖ ఎంపీగా పోటీ చేయాలని గంటాపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నా ఆయన కూడా అసెంబ్లీకే పోటీ చేస్తానంటున్నారు.

ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి శిద్దారాఘవరావును బరిలో దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ ఆయన కూడా ఎంపీగా పోటీ చేయనంటున్నారు.

రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మురళీ మోహన్ పోటీ నుంచి తప్పుకోవడంతో అక్కడ ఎవరిని బరిలో దింపాలన్న దానిపై చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు. అనకాపల్లిలోనూ అదే పరిస్థితి. ఇలా పలు స్థానాల్లో ఎంపీలుగా పోటీ చేసేందుకు నేతలు వెనుకాడుతుండడంతో చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News