శిష్యులు... పాత సహచరులు దుమ్మెత్తి పోస్తున్నారు!

రాజకీయ పార్టీల్లో విమర్శలు సహజం. ఎంతటి సీనియర్ నాయకులనైనా అవకాశం దొరికినప్పుడల్లా చీల్చి చెండాడాలనే చూస్తారు ప్రత్యర్థులు. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని వాడుకుని వీలున్నంత మైలేజీ పొందాలనుకుంటారు. అయితే రాజకీయాలలో సీనియర్ నాయకులకు కొన్నాళ్ళు శిష్యరికం చేసిన వారు… మంత్రివర్గంలో సహచరులుగా ఉన్నవారు సీనియర్ నాయకుల పై విమర్శలు చేసేటప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడతారు. అన్ని రాష్ట్రాల లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు ఉన్న తీరు ఇది. రాజకీయంగా తమకు అవకాశాలు […]

Advertisement
Update:2019-03-11 00:32 IST

రాజకీయ పార్టీల్లో విమర్శలు సహజం. ఎంతటి సీనియర్ నాయకులనైనా అవకాశం దొరికినప్పుడల్లా చీల్చి చెండాడాలనే చూస్తారు ప్రత్యర్థులు. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని వాడుకుని వీలున్నంత మైలేజీ పొందాలనుకుంటారు.

అయితే రాజకీయాలలో సీనియర్ నాయకులకు కొన్నాళ్ళు శిష్యరికం చేసిన వారు… మంత్రివర్గంలో సహచరులుగా ఉన్నవారు సీనియర్ నాయకుల పై విమర్శలు చేసేటప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడతారు. అన్ని రాష్ట్రాల లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు ఉన్న తీరు ఇది.

రాజకీయంగా తమకు అవకాశాలు ఇచ్చిన వారిని కానీ, అందలం ఎక్కించిన వారిని కానీ విమర్శించేటప్పుడు కాసింత జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న నారా చంద్రబాబు నాయుడికి మాత్రం ఆయన తన శిష్యులుగా చెప్పుకుంటున్న నాయకులు, గతంలో మంత్రులుగా ఉన్న సహచరులు దుమ్మెత్తిపోస్తున్నారు. వీరంతా విలేకరుల సమావేశం నిర్వహించి మరీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

తానే రాజకీయ భిక్ష పెట్టాను అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కు రిటైర్మెంట్ దగ్గర పడిందని, ఆయన ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని అన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ లో అవినీతి సున్నా శాతం ఉందంటూ చెబుతున్న చంద్రబాబు నాయుడు దాన్ని నిరూపిస్తే తాను పదవికి చంద్రబాబు నాయుడు దాన్ని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కూడా సవాల్ విసిరారు తలసాని. దీంతో చంద్రబాబు నాయుడు దిమ్మతిరిగింది అంటున్నారు పార్టీ నాయకులు.

చంద్రబాబు నాయుడు సహచరుడు గా ఉన్న విశాఖ జిల్లాకు చెందిన దాడి వీరభద్రరావు అయితే “తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ని డబుల్ టంగ్ కాదు. అది మల్టీ టంగ్” అని విమర్శించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి అయితే తెలుగుదేశం పార్టీలో స్వతంత్రం లేదని, అంతా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా నడుచుకోవాల్సిందే నని విమర్శలు గుప్పించారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్, ఆమంచి వంటి వారైతే తెలుగుదేశం పార్టీలో పెరుగుతున్న స్వకుల ప్రేమ, నానాటికీ పెరుగుతున్న అవినీతి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చిత్రమేమిటంటే వీరంతా చంద్రబాబు నాయుడు తన శిష్యులుగా చెప్పుకుంటున్న వారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలోనూ కూడా శిష్యులు, సహచరులుగా చెప్పుకుంటున్న వారెవరూ ఈ స్థాయిలో సీనియర్ నాయకుడిపై విరుచుకుపడ లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విమర్శలు విన్న తర్వాత అయినా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.

Tags:    
Advertisement

Similar News