గ్రూప్-3 ప్రాథ‌మిక కీ విడుద‌ల

గ్రూప్-3 ప‌రీక్ష‌కు సంబంధించి టీజీపీఎస్సీ కీల‌క అప్డేట్ ఇచ్చింది.

Advertisement
Update:2025-01-08 18:47 IST

గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్-3 ప‌రీక్ష‌లకు సంబంధి ఇవాళ కీని టీజీపీఎస్సీ విడుద‌ల చేసింది. అభ్య‌ర్థుల వ్య‌క్తిగ‌త లాగిన్‌లో అందుబాటులో ప్రాథ‌మిక కీని ఉంచిన‌ట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ నెల 12వ తేదీ వ‌ర‌కు గ్రూప్-3 కీ అందుబాటులో ఉండ‌నుంది. ఇక అభ్యంత‌రాల‌ను ఆంగ్ల భాష‌లోనే తెల‌పాల‌ని అధికారులు సూచించారు.

న‌వంబ‌ర్ 15, 16 తేదీల్లో గ్రూప్-3 ప‌రీక్ష‌లను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్ష‌కు కేవ‌లం 50 శాతం మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఏమైన అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12న సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చని టీజీపీఎస్సీ పేర్కొంది.కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News