వైజాగ్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ
స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం
Advertisement
ప్రధాని నరేంద్రమోదీ వైజాగ్ కు చేరుకున్నారు. భువనేశ్వర్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ వరకు నిర్వహించే ర్యాలీలో ప్రధాని పాల్గొంటారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
Advertisement