రాజకీయ ప్రచారానికి ఆర్మీని వాడుకోవద్దు : ఈసీ హెచ్చరిక

ఆధునిక ప్రజాస్వామ్యంలో సాయుధ బలగాలు… ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేని, తటస్థమైన ఒక వ్యవస్థ మాత్రమేనని వాటిని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం నేరమని ఈసీ చెబుతోంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వింగ్ కమాండర్ అభినందన్ ఫొటోతో కలిపి మోడీ, అమిత్‌షాలతో రూపొందించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి పిర్యాదులు అందాయి. దీంతో ఈసీ పై విధంగా స్పందించింది. పార్టీలు సాయుధబలగాలను రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవద్దని ఈసీ హెచ్చరించింది. ఢిల్లీలో ఏర్పాటు […]

Advertisement
Update:2019-03-10 05:32 IST

ఆధునిక ప్రజాస్వామ్యంలో సాయుధ బలగాలు… ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేని, తటస్థమైన ఒక వ్యవస్థ మాత్రమేనని వాటిని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం నేరమని ఈసీ చెబుతోంది.

ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వింగ్ కమాండర్ అభినందన్ ఫొటోతో కలిపి మోడీ, అమిత్‌షాలతో రూపొందించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి పిర్యాదులు అందాయి. దీంతో ఈసీ పై విధంగా స్పందించింది. పార్టీలు సాయుధబలగాలను రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవద్దని ఈసీ హెచ్చరించింది.

ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అభినందన్, మోడీ, అమిత్‌షాలతో కలిపి రూపొందించి.. దానిపై ‘మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ క్యాప్షన్‌ను బీజేపీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా వినియోగించబోతోంది. దీంతో ఈ ఫ్లెక్సీపై విమర్శలు వెల్లువెత్తాయి.

2013 డిసెంబర్ 4నే ఈసీ అన్ని పార్టీలకు ఒక నోటీసును పంపించింది. భద్రతా దళాలు దేశాన్ని రక్షించే ఒక వ్యవస్థ మాత్రమే. ఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కు సంబంధించిన వ్యక్తుల ఫొటోలు, పోరాటాలకు సంబంధించిన ఫొటోలు రాజకీయ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ప్రచారానికి వినియోగించరాదని స్పష్టంగా పేర్కొంది. ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని కూడా ఈసీ పేర్కొంది.

ఇక, పాక్ ఆర్మీ చెర నుంచి అభినందన్‌ను విడిపించడం మోడీ ఘనతేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని పేర్కొన్నారు. అభినందన్ ఒక ఆర్ఎస్ఎస్ వాలంటీర్ అని ఇవాళ అతను తిరిగి ఇండియా రావడం సంఘ్ పరివార్ తప్పక గర్విస్తుందని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తలను బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News