ఇస్తే ముగ్గురికి లేదంటే....

కర్నూలు జిల్లాలో పార్టీ ఫిరాయించిన భూమా వారసులు, భూమా బామ్మర్ది… సీట్ల కోసం పోరాటం చేస్తున్నారు. సోలో ఫైట్‌తో సాధించేది ఏమీ ఉండదని తెలుసుకున్న అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డిలు… కలిసికట్టుగా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఆళ్లగడ్డ స్థానం అభ్యర్థిగా అఖిలప్రియను ప్రకటించిన చంద్రబాబు… నంద్యాల, కర్నూలు సీట్లను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. ఈ రెండు సీట్లలో సిట్టింగ్‌లకే టికెట్‌ ఇస్తానని చంద్రబాబు చెప్పినా… లోకేష్‌తో టీజీ భరత్‌ సమావేశం […]

Advertisement
Update:2019-03-10 01:55 IST

కర్నూలు జిల్లాలో పార్టీ ఫిరాయించిన భూమా వారసులు, భూమా బామ్మర్ది… సీట్ల కోసం పోరాటం చేస్తున్నారు. సోలో ఫైట్‌తో సాధించేది ఏమీ ఉండదని తెలుసుకున్న అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డిలు…
కలిసికట్టుగా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటి వరకు ఆళ్లగడ్డ స్థానం అభ్యర్థిగా అఖిలప్రియను ప్రకటించిన చంద్రబాబు… నంద్యాల, కర్నూలు సీట్లను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. ఈ రెండు సీట్లలో సిట్టింగ్‌లకే టికెట్‌ ఇస్తానని చంద్రబాబు చెప్పినా…
లోకేష్‌తో టీజీ భరత్‌ సమావేశం తర్వాత పరిస్థితి మారిపోయింది. కర్నూలు స్థానాన్ని టీజీ భరత్‌కు అప్పగించేందుకు టీడీపీ పెద్దలు మొగ్గు చూపుతున్నారు.

టీజీ భరత్‌కు టికెట్‌ ఇవ్వకపోతే వారు పార్టీ మారే అవకాశం ఉంది. అదే ఎస్వీ మోహన్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వకపోయినా ఆయన ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్‌ రెడ్డిని పక్కనపెట్టి టీజీ భరత్‌కే కర్నూలు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు నంద్యాల సీటు విషయంలోనూ బ్రహ్మానందరెడ్డికి హామీ రావడం లేదు.

ఈ నేపథ్యంలో సోదరుడు, మామతో భూమా అభిలప్రియ చేయి కలిపారు. టికెట్లు ఇస్తే ముగ్గురికి ఇవ్వాల్సిందేనని.. లేనిపక్షంలో తాము ముగ్గురం పోటీకి దూరంగా ఉంటామని పార్టీ పెద్దలకు వారు స్పష్టం చేసి వచ్చారు. ఈ బ్లాక్‌మెయిల్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News