చిరంజీవి బయోపిక్ తీస్తే ఎవరూ చూడరు....
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా కూడా బయోపిక్స్ హవా నడుస్తుంది. ఇప్పటికే తెలుగులో కూడా చాలా బయోపిక్స్ వచ్చాయి… మరికొన్ని రాబోతున్నాయి కూడా. ఈ నేపధ్యంలో మెగా స్టార్ చిరంజీవి జీవిత చరిత్ర ఆధారంగా కూడా ఒక బయోపిక్ తీస్తే బాగుంటుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. కానీ చిరంజీవి బయోపిక్ అస్సలు బాగోదు అని మెగా బ్రదర్ నాగ బాబు అన్నారు. నాగ బాబు కి చిరంజీవి బయోపిక్ తెరకేక్కించాలి అనే ఆలోచన కూడా అస్సలు లేదట. […]
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా కూడా బయోపిక్స్ హవా నడుస్తుంది. ఇప్పటికే తెలుగులో కూడా చాలా బయోపిక్స్ వచ్చాయి… మరికొన్ని రాబోతున్నాయి కూడా.
ఈ నేపధ్యంలో మెగా స్టార్ చిరంజీవి జీవిత చరిత్ర ఆధారంగా కూడా ఒక బయోపిక్ తీస్తే బాగుంటుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. కానీ చిరంజీవి బయోపిక్ అస్సలు బాగోదు అని మెగా బ్రదర్ నాగ బాబు అన్నారు.
నాగ బాబు కి చిరంజీవి బయోపిక్ తెరకేక్కించాలి అనే ఆలోచన కూడా అస్సలు లేదట. ఈ బయోపిక్ ఎందుకు బాగోదో కూడా చెప్పారు నాగబాబు. “సినిమా అంటే అప్ అండ్ డౌన్స్, హ్యాపీ, స్యాడ్ ఉండాలి. కాని అన్నయ్య జీవితంలో అలాంటివి తక్కువగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోదు. సావిత్రి, సిల్క్ స్మిత బయోపిక్ లలో కొన్ని ముఖ్య ఘట్టాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. అందుకే సినిమాను చూశారు. కానీ అన్నయ్య జీవితంలో అలాంటివి ఏమి లేవు, సో అప్పుడు బయోపిక్ ని ఎవరూ చూడరు. పైగా రామ్ చరణ్ కి కూడా ఈ బయోపిక్ పై అస్సలు ఆసక్తి లేదనే నేను అనుకుంటున్నాను” అని నాగ బాబు అన్నాడు.