అబ్బే... అయిపోయింది... బాబు మాట వినడం లేదు!
తెలుగుదేశం పార్టీలో ఆయన ఏకైక నాయకుడు. పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ను పడదోసి పార్టీని హస్తగతం చేసుకున్న నాయకుడు. గడచిన రెండున్నర దశాబ్దాలుగా పార్టీలో మరో నాయకుడు అంటూ లేకుండా చేసిన రాజకీయ చతురత ఆయన సొంతం. ఆయనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పార్టీ అధ్యక్షుడైన ఈ రెండున్నర దశాబ్దాలలో ఆయన మాట వినని నాయకుడు లేడు. ఆయన కనుసన్నల్లోనే అందరూ పని చేశారు. చంద్రబాబు నాయుడును ఎదిరించిన వారు చివరికి పార్టీ […]
తెలుగుదేశం పార్టీలో ఆయన ఏకైక నాయకుడు. పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ను పడదోసి పార్టీని హస్తగతం చేసుకున్న నాయకుడు. గడచిన రెండున్నర దశాబ్దాలుగా పార్టీలో మరో నాయకుడు అంటూ లేకుండా చేసిన రాజకీయ చతురత ఆయన సొంతం. ఆయనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
పార్టీ అధ్యక్షుడైన ఈ రెండున్నర దశాబ్దాలలో ఆయన మాట వినని నాయకుడు లేడు. ఆయన కనుసన్నల్లోనే అందరూ పని చేశారు. చంద్రబాబు నాయుడును ఎదిరించిన వారు చివరికి పార్టీ వదిలి వెళ్ళిపోయారు తప్ప ఏమీ సాధించలేక పోయారు అనే ఖ్యాతి చంద్రబాబు సొంతం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. రెండున్నర దశాబ్దాల ఏకచ్ఛత్రాధిపత్యానికి కాలం చెల్లింది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక చంద్రబాబు నాయుడు కి తలనొప్పిగా మారింది. తాను అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత ఏ నియోజకవర్గంలోనూ టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఎలాంటి సమావేశాలు పెట్టకూడదు అంటూ చంద్రబాబు నాయుడు నిబంధన విధించారు. అయితే ఆ నిబంధనలను తెలుగు తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు.
ఇప్పటివరకు ఐదారు జిల్లాలలో పార్టీ శాసన సభ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశారు చంద్రబాబు. ఈ జిల్లాలన్నింటిలోనూ ఆయా అభ్యర్థులకు వ్యతిరేకంగా టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు తమ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
అయితే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి చెందిన సీనియర్ నాయకుడు బాపిరాజు తమ అధినేత చంద్రబాబును బహిరంగంగానే ధిక్కరించడం ప్రారంభించారు. ఎన్నాళ్లుగానో వేచి ఉన్న తనకు కాదని ఈలి నాని కి టికెట్ ఇవ్వడంతో రాజు తన అనుచరగణంతో శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. ఇది తెలిసిన చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పినా బాపిరాజు పెడచెవిన పెట్టారని మండిపడుతున్నారు. ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని ఆదేశించారు.
అధికారికంగా ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో చాలా జిల్లాలలో తెలుగు తమ్ముళ్లు నిశ్శబ్దంగానే ఉన్నారంటున్నారు. టికెట్ ఆశిస్తున్న వారు తమను కాదని వేరొకరికి పార్టీ టికెట్ కేటాయిస్తే మాత్రం పశ్చిమగోదావరి జిల్లా నాయకులు బాపిరాజును ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
“ఇన్నాళ్లూ పార్టీ అధినేత మాటకు కట్టుబడి ఉన్నాం. ఎన్నాళ్లనుంచో సేవ చేస్తున్న మాకు టిక్కెట్టు లేదంటూ ఇతరులకు అవకాశం కల్పిస్తే మాత్రం ఎదురు తిరగడం ఖాయం” అని తమ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నారట. ముందు ముందు తమ అధినేత చంద్రబాబు నాయుడు నిబంధనలను పట్టించుకునేది లేదంటూ ఎదురు తిరుగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుందని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇన్నాళ్లు ఒంటిచేత్తో పార్టీని నడిపించిన చంద్రబాబుకు ఇంత పెద్ద కష్టం వస్తుందని ఏనాడు ఊహించలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.