మహేంద్ర సింగ్ ధోనీని ఊరిస్తున్న 17 వేల పరుగుల రికార్డు

17 వేల పరుగుల రికార్డుకు 33 పరుగుల దూరంలో మహీ హోంగ్రౌండ్ రాంచీ స్టేడియంలో ధోనీకి అరుదైన అవకాశం 17వేల పరుగుల క్లబ్ లో సచిన్,ద్రావిడ్, కొహ్లీ, వీరూ, గంగూలీ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీని….అంతర్జాతీయ క్రికెట్లో 17000 పరుగుల రికార్డు ఊరిస్తోంది. వివిధ ఫార్మాట్లో కలసి తన కెరియర్ లో ఇటీవలి నాగపూర్ వన్డే వరకూ మహేంద్ర సింగ్ ధోనీ…16 వేల 967 పరుగులు సాధించాడు. ఇందులో… ఆసియా లెవెన్ తరపున సాధించిన పరుగులు […]

Advertisement
Update:2019-03-08 07:14 IST
  • 17 వేల పరుగుల రికార్డుకు 33 పరుగుల దూరంలో మహీ
  • హోంగ్రౌండ్ రాంచీ స్టేడియంలో ధోనీకి అరుదైన అవకాశం
  • 17వేల పరుగుల క్లబ్ లో సచిన్,ద్రావిడ్, కొహ్లీ, వీరూ, గంగూలీ

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీని….అంతర్జాతీయ క్రికెట్లో 17000 పరుగుల రికార్డు ఊరిస్తోంది. వివిధ ఫార్మాట్లో కలసి తన కెరియర్ లో ఇటీవలి నాగపూర్ వన్డే వరకూ మహేంద్ర సింగ్ ధోనీ…16 వేల 967 పరుగులు సాధించాడు. ఇందులో… ఆసియా లెవెన్ తరపున సాధించిన పరుగులు సైతం ఉన్నాయి.

హోంగ్రౌండ్ జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మూడోవన్డేలో…ధోనీ మరో 33 పరుగులు సాధించగలిగితే 17వేల పరుగుల రికార్డును చేరుకోగలుగుతాడు.

మొత్తం 528 మ్యాచ్ లు ఆడిన ధోనీ 16 సెంచరీలు, 106 హాఫ్ సెంచరీలతో సహా 16 వేల 967 పరుగులతో 45 సగటు నమోదు చేశాడు. ఇందులో 4 వేల 876 టెస్ట్ పరుగులు, 10 వేల 474 పరుగుల వన్డే, 1617 పరుగుల టీ-20 రన్స్ ఉన్నాయి.

ఇంతకు ముందే 17వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత దిగ్గజ క్రికెటర్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కొహ్లీ, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు.

సచిన్ టెండుల్కర్ 34 వేల 357 పరుగులు, ఇండియన క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ 24వేల 208, విరాట్ కొహ్లీ 19 వేల 453, సౌరవ్ గంగూలీ 18 వేల 575, వీరేంద్ర సెహ్వాగ్ 17 వేల 253 పరుగులు సాధించారు.

మహేంద్ర సింగ్ ధోనీ…ఆసీస్ తో మిగిలిన రెండువన్డేలలో 33 పరుగులు సాధించగలిగితే…17వేల పరుగుల క్లబ్ లో చోటు ఖాయం చేసుకొనే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News