కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల.... లిస్ట్‌లో కనిపించని ప్రియాంక !

కేంద్రంలో తిరిగి యూపీయేను అధికారంలోనికి తీసుకొని రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ లోక‌సభ ఎన్నికలకు పూర్తి స్థాయి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల పీసీసీల నుంచి ఆశావాహుల జాబితాను తెప్పించి స్క్రీనింగ్ కమిటీతో వడపోత కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గుజరాత్‌లోని 4 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లోని 11 పార్లమెంటు స్థానాలకు తమ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ పేర్లు […]

Advertisement
Update:2019-03-08 01:46 IST

కేంద్రంలో తిరిగి యూపీయేను అధికారంలోనికి తీసుకొని రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ లోక‌సభ ఎన్నికలకు పూర్తి స్థాయి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల పీసీసీల నుంచి ఆశావాహుల జాబితాను తెప్పించి స్క్రీనింగ్ కమిటీతో వడపోత కార్యక్రమం మొదలు పెట్టారు.

ఈ నేపథ్యంలో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గుజరాత్‌లోని 4 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లోని 11 పార్లమెంటు స్థానాలకు తమ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ పేర్లు ఉన్నా.. ఇటీవలే జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టిన ప్రియాంకా గాంధీ వాద్రా పేరు మాత్రం లేకపోవడం గమనార్హం.

అమేథి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. రాయబరేలీ నుంచి సోనియా తిరిగి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ గెలిచినవి ఈ రెండు సీట్లే కావడం విశేషం. 2014 ఎన్నికల్లో ఫరుఖ్కాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఖుషీనగర్ నుంచి ఆర్‌పీఎన్ సింగ్ పోటీ చేస్తారు.

మహాకూటమికి ఝలక్ ఇస్తూ యూపీలో ఇటీవల ఎస్పీ-బీఎస్పీ కూటమి…. అమేథి, రాయబరేలి తప్ప అన్ని సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా యూపీలోని 80 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.

యూపీతో పాటు కీలకమైన గుజరాత్‌లో కూడా బలమైన అభ్యర్థులను నిలపాలని భావిస్తోంది. ప్రస్తుతం 4 సీట్లు మాత్రమే ప్రకటించినా మరో వారం, పది రోజుల్లో మిగతా సీట్లు కూడా ప్రకటిస్తామని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది.

ప్రకటించిన 15 స్థానాలు ఇవే..!

1. రాజు పర్మార్, అహ్మదాబాద్ వెస్ట్ (ఎస్సీ), గుజరాత్.
2. భరత్‌సింగ్ ఎం. సోలంకి, ఆనంద్, గుజరాత్.
3. ప్రశాంత్ పటేల్, వడోదర, గుజరాత్.
4. రంజిత్ మోహన్ సిన్హ్ రథ్వా, చోటా ఉదయ్ పూర్ (ఎస్టీ), గుజరాత్.
5. ఇమ్రాన్ మసూద్, షహరన్‌పూర్, యూపీ.
6. సలీమ్ ఇక్బాల్ షేర్వానీ, బదౌన్, యూపీ.
7. జితిన్ ప్రసాద్, దౌరారా, యూపీ.
8. అన్నూ టాండన్, ఉన్నావ్, యూపీ.
9. సోనియా గాంధీ, రాయబరేలీ, యూపీ.
10. రాహుల్ గాంధీ, అమేథి, యూపీ.
11. సల్మాన్ ఖుర్షీద్, ఫరుఖ్కాబాద్, యూపీ.
12. రాజారాం పాల్, అక్బర్ పూర్, యూపీ.
13. బ్రిజ్‌లాల్ ఖబ్రీ, జలౌన్ (ఎస్సీ), యూపీ.
14. నిర్మల్ ఖత్రీ, ఫైజాబాద్, యూపీ.
15. ఆర్‌పీఎన్ సింగ్, ఖుషీ నగర్, యూపీ.

Tags:    
Advertisement

Similar News